Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో పెన్షన్ పంపిణీ.. ఉదయం 9 నుంచి 7 గంటల వరకు పెన్షన్ పంపీణి కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి పెన్షన్ల (Pensions) పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈరోజు నుండి ఈనెల 6 వరకు పెన్షన్ల పంపిణీ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి పెన్షన్ల (Pensions) పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈరోజు నుండి ఈనెల 6 వరకు పెన్షన్ల పంపిణీ జరగనుంది. కాగా సచివాలయ సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వం రెండు విధానాల్లో పెన్షన్ల పంపిణీ చేయనుంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇంటి దగ్గరకే పెన్షన్.. మిగతా వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో పంపిణీ చేస్తారు.
ఇటీవలే ఒకటో తేదీ ఇంటికి పెన్సన్ రాకపోవడంతో.. ఇద్దరు వృద్ధులు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ప్రతిపక్షాలు ఎక్స్ వేదికగా వైసీపీ (YCP) ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయనున్నాయి. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు.