Pinnelli EVM Case : పిన్నెల్లికి బిగుస్తున్న ఉచ్చు క్రిమినల్ కేసు – అనర్హత తప్పదా ?

ఏపీలోని పల్నాడులో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పాలవాయి గేటులో EVM ధ్వంసం చేయడాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై క్రిమినల్ చర్యలతో పాటు... మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. హౌస్ అరెస్ట్ నుంచి పిన్నెల్లి తప్పించుకుపోయినా... పట్టించుకోని పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు టీడీపీ లీడర్లు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 22, 2024 | 12:23 PMLast Updated on: May 22, 2024 | 12:23 PM

Pinnelli Evm Case

ఏపీలోని పల్నాడులో ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పాలవాయి గేటులో EVM ధ్వంసం చేయడాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. మే 13 పోలింగ్ జరిగిన రోజున… రెంటచింతల మండలం పాల్వాయి గేట్ లో బూత్ నెంబర్ 202 లో ఈవీఎంను ధ్వంసం చేశారు మాచర్ల ఎమ్మెల్యే. వెబ్ కాస్టింగ్ కెమెరాల్లో ఈవీఎం ధ్వంసం చేసిన విజువల్స్ స్పష్టంగా రికార్డు అయ్యాయి. పోలింగ్ బూత్ 7వ నంబర్ లోనూ ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. పిన్నెల్లి కోపంగా పోలింగ్ కేంద్రంలోకి రావడం… డైరెక్ట్ గా ఈవీఎంలను నేలకేసి కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. టీడీపీ లీడర్లు, కార్యకర్తలు రిగ్గింగ్ కి పాల్పడినందునే ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని వైసీపీ వాదిస్తోంది.
గడిచిన 4రోజులుగా హైదరాబాదులోనే మకాం వేశారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్లలో పోలీసుల అదుపులో, హౌస్ అరెస్ట్ లో ఉండి కూడా… అర్ధరాత్రి టైమ్ లో హైదరాబాదుకు వెళ్ళిపోయారు పిన్నెల్లి సోదరులు. ఆయన చర్యలను కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. సమగ్ర నివేదిక సమర్పించాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను వివరణ కోరింది. దీనిపై ఈసీకి రిపోర్ట్ కూడా పంపారు మీనా. ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరును చేర్చారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదుకు డీజీపీకి సిఫార్సు చేయాలని సీఈసీ ఆదేశించింది. మాచర్ల నియోజకవర్గంలో రెండు ఈవీఎంలే కాదు… ఏడింటిని వైసీపీ ధ్వంసం చేసినట్టు టీడీపీ ఆరోపిస్తోంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై క్రిమినల్ చర్యలతో పాటు… మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. హౌస్ అరెస్ట్ నుంచి పిన్నెల్లి తప్పించుకుపోయినా… పట్టించుకోని పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు టీడీపీ లీడర్లు.