Jagan Mulakhat : మరికాసేపట్లో.. పిన్నెల్లితో జగన్ ములాఖత్..
ఇవాళ ఉదయం హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు.

Pinnelli Jagan Mulakhat today..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లాకు వెళ్లానున్నారు. నెల్లూరు జిల్లాలోని సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వైయస్ జగన్ నేడు ములాఖత్ కానున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం పగలగొట్టిన వ్యవహారంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొద్ది రోజుల కిందటే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.. దీంతో పిన్నెల్లికి మాచర్ల సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయను పరామర్శించేందుకు నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు.
ఇవాళ ఉదయం హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని కలిసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకొని హెలికాప్టర్లో తాడేపల్లి వెళ్లనున్నారు.