బెయిల్ వచ్చినా.. ఆనందం లేదు.. పాపం.. పిన్నెల్లి..
ఏపీలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దీనంగా మారుతోంది. అధికారం అడ్డుపెట్టుకొని.. జగన్ సర్కార్‌లో వైసీపీ నేతలు చేసిన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. దీంతో వైసీపీ నేతల తీరు.. టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది.ఇక ఎన్నికల సమయంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఏపీలో వైసీపీ పరిస్థితి రోజురోజుకు దీనంగా మారుతోంది. అధికారం అడ్డుపెట్టుకొని.. జగన్ సర్కార్‌లో వైసీపీ నేతలు చేసిన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్. దీంతో వైసీపీ నేతల తీరు.. టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది.ఇక ఎన్నికల సమయంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎన్నికలకు ముందు మాచర్లలో రాజకీయ హత్యలు ప్రోత్సహిండం మొదలు.. పోలింగ్ రోజు ఈవీఎం బద్దలు కొట్టడం వరకు పిన్నెల్లి అరాచకాలు అన్ని ఇన్ని కావు.
ఈ కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లికి.. ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐతే బెయిల్ లభించిన ఆనందం కాసేపు కూడా లేకుండా పిన్నెల్లికి మాచర్ల వైసీపీ కౌన్సిలర్లు షాకిచ్చారు. బెయిల్‌పై ఉన్న పిన్నెల్లి మాచర్ల వచ్చేసరికి మాచర్లలో వైసీపీకి ఒక్క కౌన్సిలర్ మాత్రమే ఉండడం షాకింగ్‌గా మారింది. మాచర్ల మున్సిపాలిటీలో 16 మంది వైసీపీ కౌన్సిలర్లు… టీడీపీలో చేరడంతో పిన్నెల్లికి భారీ షాక్ తగిలింది. దీంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో పడింది. మాచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌గా ఉన్న టీడీపీ నేత పోలూరు నరసింహారావును మున్సిపల్ ఛైర్మన్‌గా 30మంది టీడీపీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు.
పోలూరు నరసింహారావు చైర్మన్‌గా ప్రమాణస్వీకారం కూడా చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో పోలూరు ఇటీవల టీడీపీలో చేరారు. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 31 వార్డులు ఉన్నాయ్. కొద్ది రోజుల కిందే 14మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఇప్పుడు మరో 16 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో, వైసీపీ కంచుకోటగా, పిన్నెల్లి అడ్డాగా మారిన మాచర్లలో టీడీపీ పాగా వేసింది. ఇక అటు బెయిల్ సందర్భంగా పిన్నెల్లికి కోర్టు పలు షరతులు విధించింది. 50 వేల విలువైన రెండు పూచీకత్తులను సమర్పించాలని, పాస్ పోర్టును అప్పగించాలని, ప్రతి వారం పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని ఆదేశించింది.