Mudragada Padmanabham : పిఠాపురం కాపులకు ముద్రగడ లేఖ…
ఇక్కడ పవన్ కళ్యాన్‌ను ఓడించేందుకు వైసీపీ (YCP) ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయాత్నాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా కాకినాడలోని కాపు ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.

Pithapuram is now the hottest seat among all the assembly constituencies in anchor AP.
యాంకర్ ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పుడు అన్నిటికంటే హాట్ సీట్ పిఠాపురం(Pithapuram). జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాన్ (Pawan Kalyan) స్వయంగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో అందరి చూపు ఇప్పుడు కాకినాడ జిల్లా పుఠాపురం మీదే ఉంది. ఇక్కడ పవన్ కళ్యాన్‌ను ఓడించేందుకు వైసీపీ (YCP) ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయాత్నాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా కాకినాడలోని కాపు ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పవన్‌కు వ్యతిరేకంగా ప్రయత్నించింది. వైసీపీలో చేరినప్పటి నుంచీ ముద్రగడ పవన్ కళ్యాణ్‌ను నేరుగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోని కాపులకు మద్రగడ ఓ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల కోసం సీఎం జగన్ చేసిన మంచిని ఎవరూ మర్చిపోవద్దంటూ కోరారు. తాను ఎంతో మంది ముఖ్యమంత్రులతో కలిసి పని చేశానని.. కానీ జగన్‌కు ఉన్న కమిట్‌మెంట్ ఎవరిలోనూ చూడలేదంటూ చెప్పారు. ఓ వైపు జగన్‌ను పొగుడుతూనే మరోవైపు కూటమిపై విమర్శలు చేశారు. సైకిల్ ఒకప్పుడు ప్రతీ ఒక్కరూ వాడారని.. కానీ ఇప్పుడు మాత్రం అంతా బైక్స్ వాడుతున్నారని..
ఇక సైకిల్ వ్వాలిడీటీ ఐపోయినట్టే అంటూ చెప్పారు. గాజు గ్లాస్ (glass glass) పగిలి కూడా చాలా రోజులు అయ్యిందని.. ఆ ముక్కలు గుచ్చుకోకుండా ఉండేందుకు అంతా గ్లాసును దూరంగా ఉంచాలంటూ జనసేనను టార్గెట్ చేశారు. ఇక ఫ్యాన్ అనేది ప్రతీ ఇంట్లో అవసరమని.. అదే వైసీపీ గుర్తు అంటూ చెప్పారు. ఒక్క బీజేపీ తప్ప కూటమిలో ఉన్న రెండు పార్టీలు సముద్రగర్భంలో ఉన్నాయని ఆ పార్టీలకు గనక ఓటేస్తే భవిష్యత్తును నాశనం చేసుకున్నట్టే అంటూ చెప్పారు. పుఠాపురంలో కాపులంతా వైసీపీకి అండగా నిలవాలంటూ కోరారు.