AP Politics : బాబు,లోకేష్,బాలయ్య ఓటమికి ప్లాన్.. ముగ్గురు లీడర్లకు జగన్ టార్గెట్ !
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. జగన్ మాత్రం టీడీపికి చెందిన ముగ్గురిని టార్గెట్ చేశారు. అందులో ఒకరు టీడీపీ (TDP) అధినేత జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy), రెండోవారు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, మరో నేత నందమూరి బాలకృష్ణ.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో (AP Assembly Elections) ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. జగన్ మాత్రం టీడీపికి చెందిన ముగ్గురిని టార్గెట్ చేశారు. అందులో ఒకరు టీడీపీ (TDP) అధినేత జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy), రెండోవారు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, మరో నేత నందమూరి బాలకృష్ణ. ఈ ముగ్గుర్నీ ఓడించడానికి వైసీపీకి చెందిన ముగ్గురు సీనియర్లను రంగంలోకి దించారు. టీడీపీ లీడర్ల ఓటమే లక్ష్యంగా నియోజకవర్గాల్లో ప్లాన్ చేశారు. బాబు, లోకేష్, బాలయ్యబాబును ఓడిస్తే… రాబోయే ప్రభుత్వంలో మీకు కీలక పదవులు ఇస్తానని జగన్ ఆఫర్ కూడా ఇచ్చినట్టు సమాచారం.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణను ఓడించాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. అందుకే ముగ్గురు హేమా హేమీలను కుప్పం, మంగళగిరి (Mangalagiri) హిందూపురం నియోజకవర్గాల్లోకి దించారు. చంద్రబాబు (Chandrababu) పోటీ చేస్తున్న కుప్పంతో పాటు హిందూపురం బాధ్యతలు కూడా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తున్నారు. అసలు చంద్రబాబును కుప్పంలో ఓడించాలన్నది జగన్ కల. అందుకే అక్కడ భరత్ కు ఎమ్మెల్సీ ఇచ్చి… నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబును ఓడించి భరత్ ను ఎమ్మెల్యేను చేస్తే… మంత్రి పదవి ఇస్తాననని కుప్పం నియోజకవర్గంలో స్వయంగా చెప్పారు సీఎం జగన్.
కుప్పంతో పాటు హిందూపురం బాధ్యతలు కూడా పెద్దిరెడ్డి చూస్తున్నారు. స్థానిక సంస్థల్లో వైసీపీకి మెజారిటీ రావడంతో ఈసారి ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు తమ వైపు టర్న్ అవుతారని భావిస్తున్నారు. పెద్దిరెడ్డి అయితే తన నియోజకవర్గం పుంగనూరు కంటే… కుప్పం, హిందూపురంల్లోనే ఎక్కువగా పర్యటిస్తున్నారు. వైసీపీ లీడర్లు అందర్నీ కలిపి పోటీకి సిద్ధం చేస్తున్నారు. హిందూపురంలో గతంలో ఐదు వర్గాలుగా ఉన్న వైసీపీ గ్రూపులను ఏకం చేశారు పెద్దిరెడ్డి.
ఇక మంగళగిరి బాధ్యతలను ఎంపీ విజయ్ సాయి రెడ్డి (MP Vijaya Sai Reddy) చూస్తున్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో గంజి చిరంజీవికి టిక్కెట్ ఇస్తుండటంతో… ముందే వైసీపీ నుంచి బయటపడ్డారు ఆర్కే. షర్మిల (Sharmila) ఏపీ పాలిటిక్స్ (AP Politics) లోకి రావడంతో ఆమె వెంట నడుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మంగళగిరి నుంచే పోటీ చేస్తారు ఆర్కే. 2019లో లోకేష్ ని ఓడించింది ఆయనే. అయితే ఈసారి మంగళగిరిలో వైసీపీ పరిస్థితి అంత బాగోలేదు. ఆ పార్టీలో మూడు గ్రూపులు ఉన్నాయి. వీళ్ళందర్నీ ఏకం చేసి మరోసారి వైసీపీని గెలిపించాలన్నది విజయసాయి రెడ్డి లక్ష్యం. బీసీ అభ్యర్థిని నిలబెట్టడంతో పాటు… నియోజకవర్గంలోని బీసీలు అందర్నీ ఏకం చేసే పనిలో ఉన్నారు. లోకేష్ ను ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలన్నది విజయసాయి రెడ్డి టార్గెట్. కానీ ఆర్కే వెళ్ళిపోవడం… మిగతా గ్రూపులు కలసి ఎలా పనిచేస్తాయి అన్నది విజయసాయి రెడ్డి కెపాసిటీ మీద ఆధారపడింది.