Pawan Kalan-OG : ఓజీ నుంచి పవన్ పవర్ ఫుల్ పోస్టర్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటస్తోన్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓజీ . సాహోతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Power star Pawan Kalyan is a powerful action entertainer Ozzy. Sujeeth, who became a pan India director with Saaho, is directing this film.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటస్తోన్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఓజీ . సాహోతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయిన సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ గా గెలుపు ఖాయం కావడంతో సోషల్ మీడియాలో మోత మోగిపోతోంది. పవన్ కు కంగ్రాట్స్ చెప్పడంతో పాటు సినిమా పోస్టర్లతో నింపేస్తున్నారు. ఫ్యాన్స్ ఖుషిని డబుల్ చేసేలా ఓజీ మేకర్ పవర్ పుల్ పోస్టర్ ను వదిలి జోష్ ను నింపారు.
పవన్ కల్యాణ్ నయా పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్టర్ లో పవన్ కుర్చీలో కూర్చొని మంచి పవర్ఫుల్ అండ్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తుండగా చేతిలో వాచ్ పట్టుకొని కనిపిస్తున్నాడు. అలాగే దీనికి కాప్షన్ గా ఓజి సమయం ఆసన్నం అయ్యింది. అంటూ మేకర్స్ అదిరే ట్రీట్ ని ఫ్యాన్స్ లో ఎనర్జీ నింపారు
జపాన్, ముంబై నగరాల్లో ని గ్యాంగస్టర్స్ కథాంశంతో ఎంతో స్టైలిష్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, గ్లింప్స్, పవన్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఇది వరకే మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది. తాజాగా రిలీజైన పోస్టర్ సోషల్ మీడియాలను షేక్ చేస్తోంది.