IAS Krishna Teja : పిఠాపురంలో ఐఏఎస్ కృష్ణతేజ.. ఫస్ట్ ఫిర్యాదు ఏంటంటే..
పవర్‌ఫుల్ ఐఏఎస్ కృష్ణతేజ.. డిప్యూటీ సీఎం పవన్ పేషీలో చేరిపోయారు. కలెక్టర్‌గా తన మార్క్ ఏంటో కేరళకు పరిచయం చేసిన ఆయన.. ఏపీలో తన పవర్ చూపించేందుకు రెడీ అయ్యారు.
పవర్‌ఫుల్ ఐఏఎస్ కృష్ణతేజ.. డిప్యూటీ సీఎం పవన్ పేషీలో చేరిపోయారు. కలెక్టర్‌గా తన మార్క్ ఏంటో కేరళకు పరిచయం చేసిన ఆయన.. ఏపీలో తన పవర్ చూపించేందుకు రెడీ అయ్యారు. పవన్ నియోజకవర్గం పిఠాపురంలో యాక్షన్ స్టార్ట్ చేశారు. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ శాఖ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణతేజ పిఠాపురంలో పర్యటించారు. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో పిఠాపురంతో పాటు జగ్గంపేట ఏరియాలోనూ.. జనాలను కలుసుకున్నారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీల్లో ప్రాబ్లమ్స్ పరిష్కారంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
నేరుగా పొలాల దగ్గరకొచ్చి.. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు కృష్ణతేజ. గొల్లప్రోలు మండలం వన్నెపూడి, చందుర్తి గ్రామాల్లోనూ ఆయన పర్యటించారు. గులాబి, జామ తోటలను పరిశీలించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. జనసేన లోకల్ లీడర్ల తీరుపై చందుర్తి గ్రామ జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాల కష్టాలను నేతలు పట్టించుకోవట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతల తీరు పవన్ కల్యాణ్‌పై ప్రభావం చూపుతుందని.. ఫేస్ టు ఫేస్ కృష్ణతేజకు చెప్పేశారు గ్రామస్థులు. కొన్ని రోజులుగా పిఠాపురంలో అధికారుల హడావుడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఏకంగా పంచాయితీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ.. రావడంతో మరింత సందడి కనిపించింది. కృష్ణతేజకు పవర్‌ఫుల్ ఐఏఎస్‌గా పేరు ఉంది. కేరళలో ఆయన క్రియేట్ చేసిన అద్భుతాలు.. జనాల నుంచి తెచ్చుకున్న పేరు అంతా ఇంతా కాదు.
కేరళలోని అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్‌గా.. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. రిసార్ట్ మాఫియాకు కళ్లెం వేయడంలో.. బాలల హక్కులను కాపాడడంతో.. కృష్ణతేజను కేంద్రం కూడా గుర్తించింది. అవార్డుతో సత్కరించింది. అలాంటి అధికారి తమతో కలిసి పనిచేస్తే అద్భుతాలు చేయొచ్చు అని భావించిన పవన్ కల్యాణ్.. పట్టుబట్టి మరీ ఆయనను ఏపీకి పిలిపించుకున్నారు. కేంద్రంతో మాట్లాడి డిప్యుటేషన్ వ్యవహారం ఈజీగా అయ్యేలా చేశారు. అలాంటి కృష్ణతేజ.. ఇప్పుడు పిఠాపురంలో ల్యాండ్ అయ్యారు. ఇక మాములుగా ఉండదు అని మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్..