Pawan Kalyan : అధ్యక్షా.. పవన్ కళ్యాణ్ అనే నేను.. ‘ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాం’
పవన్ కల్యాణ్ ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్ లేదు.. పవన్ అంటే ఓ ప్రభంజనం.. పవన్ అంటే ఓ సునామీ.. పార్టీ పెట్టిన పదేళ్లకు గెలిచిన తొలి ఎమ్మెల్యే.. ‘జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అయిన తర్వాత 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయాడు.

President.. I am Pawan Kalyan.. 'Waiting for this moment'
పవన్ కల్యాణ్ ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్ లేదు.. పవన్ అంటే ఓ ప్రభంజనం.. పవన్ అంటే ఓ సునామీ.. పార్టీ పెట్టిన పదేళ్లకు గెలిచిన తొలి ఎమ్మెల్యే.. ‘జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అయిన తర్వాత 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయాడు. అప్పుడు ప్రజలు పవన్ ని నమ్మలేదు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు’ అన్ని నోటికొచ్చినట్లు వాగారు. అలా వాగిన నోళ్లన్నీ ఇప్పుడు మూతబడేలా పవన్ కళ్యాణ్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. జనసేన పార్టీ పోటీ చేసిన 21 చోట్లా గెలిచి ఏపీలో రికార్డు సృష్టించారు. డిప్యూటీ సీఎం హోదాలో CM తర్వాత నేడు అసెంబ్లీలో MLAగా ప్రమాణం చేయారు. ఈ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నామంటూ జనసైనికులు ఎమోషనల్ అవుతున్నారు.
పవన్ కల్యాణ్ అనే నేను.. ఈ మాట కోసం పాదేళ్లు ఎదురు చూశారు.. AP అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు.