AP Deputy CM, Pawan Kalyan : గన్నవరం చేరుకున్న టాలీవుడ్ సినీ నిర్మాతలు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో భేటి..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సమావేశం కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన నిర్మాతలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

Producers of Tollywood movie who reached Gannavaram met Deputy CM Pawan Kalyan.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సమావేశం కోసం హైదరాబాద్ నుంచి బయలుదేరిన నిర్మాతలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు తెలుగు సినీ నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి, సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చ ప్రారంభమైంది. సినీ పరిశ్రమ ఇబ్బందులను పవన్ కళ్యాణ్ కు నివేదించారు. సమావేశంలో నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య, సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, శ్రీ నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ పాల్గొన్నారు.