Allu Arjan, YCP : పుష్పకు ఘోర పరాభవం..ఏంది మచ్చా.. ఇట్టా అయింది..
ఈసారి ఏపీ ఎన్నికల్లో జరిగిన వింతలు ఎప్పుడూ కనిపించలేదు. పవన్ కల్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా ప్రచారం చేస్తే.. బన్నీ మాత్రం దూరంగా ఉన్నారు. జనసేన పేరు ఎత్తకపోగా.. వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు.
ఈసారి ఏపీ ఎన్నికల్లో జరిగిన వింతలు ఎప్పుడూ కనిపించలేదు. పవన్ కల్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా ప్రచారం చేస్తే.. బన్నీ మాత్రం దూరంగా ఉన్నారు. జనసేన పేరు ఎత్తకపోగా.. వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. పవన్ కోసం ప్రచారానికి రాకపోగా.. వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డి కోసం ప్రచారం చేయడం.. కొత్త చర్చకు దారి తీసింది. కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య దూరం పెంచిందన్న చర్చ కూడా జరిగింది. పవన్ గెలుపు కోసం బయటకు రాని బన్నీ వైసీపీ నేత గెలుపు కోసం భార్య స్నేహా రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొనడం ఏంటి అని మెగా అభిమానులు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.
ఇదేదో తేడా కొట్టే వ్యవహారంలా ఉందని.. తన ప్రేమ, మద్దతు పవన్‌కి ఎప్పుడూ ఉంటుందని.. ఆయన ఆశించిన విజయం అందుకుంటారని ట్వీట్ చేసి బన్నీ సరిపెట్టేశారు. ఐతే సరే పవన్ విషయంలో బన్నీ చేసిన పని మాత్రం తప్పు అనే ఫీలింగ్‌లోనే చాలామంది ఉన్నారు. బన్నీ సంగతి ఇలా ఉంటే అల్లు అరవింద్ కూడా పవన్ గెలుపు కోసం పెద్దగా స్పందించలేదు. బన్నీ సొంత అన్నాదమ్ముళ్లు కూడా ఎక్కడా ప్రచారంలో కనిపించలేదు. కట్ చేస్తే… ఇన్ని అవమానాలు ఎదుర్కొని, విమర్శలు పడి.. బన్నీ కష్టపడి ప్రచారం చేసిన నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాత్రం ఓడిపోయారు. శిల్పా రవిచంద్రా రెడ్డికి పుష్ప ప్రచారం కలిసి రాలేదని పవన్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
బన్నీని ట్రోల్ చేస్తున్నారు. సొంతోడిని పక్కకు పెట్టి.. బయటోడికి సపోర్ట్ చేస్తే ఇలాగే ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. పవన్ మాత్రం పిఠాపురంలో సూపర్ విక్టరీని ఖాతాలో వేసుకున్నారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి.. పవర్‌స్టార్ పవర్ ఏంటో చూపించారనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయినా..పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేసి.. 2024లో పెట్టి బీజేపీ, టీడీపీతో కూటమిగా జతకట్టారు. కూటమి ఘన విజయంలో కీలక పాత్ర వహించారు. పవన్ విజయంలో మెగా ఫ్యామిలీ కీలకంగా వ్యవహరించింది.