RAHUL GANDHI: ఏపీ నుంచి రాహుల్ పోటీ..? ఆ స్థానం నుంచే బరిలోకి..
ఏపీలో పరిణామాలపై ఖర్గేతో పాటు.. గాంధీ కుటుంబం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఐతే ఏపీలో కాంగ్రెస్‌కు సంబంధించి ఇప్పుడో కీలక పరిణామం చర్చకు వస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్.. ఏపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.
RAHUL GANDHI: ఏపీలో కాంగ్రెస్‌కు ఊపిరి పోసేందుకు ఆ పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. వైఎస్ అనే బ్రాండ్ దెబ్బతో పార్టీ డీలా పడిపోయిందని గ్రహించిన కాంగ్రెస్ పెద్దలు.. అదే బ్రాండ్‌తో బౌన్స్‌బ్యాక్ కావాలని ఫిక్స్ అయ్యారు. అందుకే షర్మిలను పార్టీలోకి తీసుకున్నారు. పార్టీ పగ్గాలు కూడా షర్మిలకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయ్. షర్మిల రాకతో కాంగ్రెస్ బలపడుతుందా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. ఏపీ మీద కాంగ్రెస్ పెద్దలు భారీగా దృష్టిసారించారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఏపీలో పరిణామాలపై ఖర్గేతో పాటు.. గాంధీ కుటుంబం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఐతే ఏపీలో కాంగ్రెస్‌కు సంబంధించి ఇప్పుడో కీలక పరిణామం చర్చకు వస్తోంది.
YS SHARMILA: షర్మిలకు ఆ పదవే ఎందుకంటే.. క్యాంపెయినర్ కాదు.. చీఫ్‌గా బాధ్యతలు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్.. ఏపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. రాహుల్ ఈ మధ్య సూపర్ యాక్టివ్ అయ్యారు. భారత్ జోడో యాత్రకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా దక్షిణాదిలో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయ్. మొన్న కర్ణాటక, నిన్న తెలంగాణ.. వరుసగా ఒక్కో రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయ్. దీంతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్‌కు చాలా కీలకం. ఐతే ఎలాగైనా గెలిచి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని రాహుల్ పట్టుదలతో కనిపిస్తున్నారు. ముందుగా వీక్‌గా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. విజయం దక్కించుకోవడంతో, ఇప్పుడు ఏపీపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక్కడ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా రాహుల్ పావులు కలుపుతున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. రాహుల్ గాంధీ ఏపీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం రెండు మూడు రోజులుగా ఊపందుకుంటోంది.
ఏపీలో తాను పోటీ చేస్తే ఆ ప్రభావం రాష్ట్రమంతా ఉంటుందని.. కాంగ్రెస్‌లోనూ కొత్త జోష్ కనిపిస్తుందని రాహుల్ అంచనా వేస్తున్నారట. విశాఖ నుంచి రాహుల్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం విషయంలో.. కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి పరిణామాల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని రాహుల్ అంచనా వేస్తున్నారట. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ రాహుల్ రెండుచోట్ల పోటీ చేశారు. యూపీలోని అమేధీతో పాటు.. కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేశారు. ఐతే అమేథీలో మాత్రమే గెలిచారు. ఇప్పుడు కూడా రెండుచోట్ల పోటీ చేయాలని.. విశాఖను సెకండ్ ఆప్షన్‌గా పెట్టుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. గెలుస్తామా లేదా అన్న సంగతి తర్వాత.. పోటీకి ఉంటే కాంగ్రెస్‌లో కొత్త ఊపు తీసుకురావొచ్చు అన్నది రాహుల్ ఆలోచనగా తెలుస్తోంది.