Heavy Rains : వచ్చే 3 రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు వర్ష సూచనలు
వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.

Rains for the next 3 days.. Rain forecast for these districts
వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు క్రియాశీలంగా కదులుతుండటం, ద్రోణి ప్రభావం కూడా ఉండటం దీనికి కారణమని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. ఏపీలోని ఉత్తరాంధ్ర మొదలు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, NLR, నంద్యాల, శ్రీసత్యసాయి, YSR కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, TPTY జిల్లాల్లో తేలికపాటి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది.