Weather Update : నేడు తెలుగు రాష్ట్రాలోని ఈ జిల్లాల్లో వర్షాలు..
తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Rains in these districts of Telugu state today..
తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు రానున్న నాలుగు రోజుల పాటు హైదరాబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో హైదరాబాద్లో IMD ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మే 16 నుండి 19 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు ఏపీలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు.. పడనున్నాయి. రాష్ట్ర ప్రజలను వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ద్రోణి ప్రభావంతో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో 2 రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలో నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.
Suresh SSM