Ramoji Rao Passed : తన పేరు తానే పెట్టుకున్న.. రామోజీ రావు

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 8, 2024 | 10:12 AMLast Updated on: Jun 08, 2024 | 10:12 AM

Ramoji Rao The Head Of Todays Organizations Was Born In Pedaparupudi Of Krishna District On 16th November 1936 In A Farmers Family

 

 

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించారు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దాంతో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతని కన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ (Ranganayakamma).

రామోజీరావు కుటుంబానిది శ్రీ వైష్ణవ నేపథ్యం. తల్లి చాలా భక్తిపరురాలు, ఆచారవంతురాలు కావడంతో చిన్నతనంలో ఇతనికీ భక్తి, శుచి అలవడింది. లేక లేక పుట్టిన మగ సంతానం కావడంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా… చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో, వంటలో సాయం చేసే అలవాటు కూడా రామోజీ రావుకి ఉండేవి. తాత పేరుతో పెట్టిన రామయ్య అన్న తన పేరు నచ్చక స్కూల్లో చేరేటప్పుడే సొంతంగా రామోజీ రావు అన్న పేరును తానే పెట్టుకున్నాడు. ఆ పేరే జీవితాంతమూ కొనసాగుతోంది. రామోజీరావు 1947లో గుడివాడలో మున్సిపల్ హైస్కూల్లో చేరారు. 1957లో ఆరవో ఫారం అక్కడే పూర్తిచేసుకుని, గుడివాడ కాలేజీలో ఇంటర్, బీఎస్సీ చదివారు.

1961 ఆగస్టు 19న రామోజీరావుకు, పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవి రెండో కుమార్తె రమాదేవితో పెళ్ళి జరిగింది. రమాదేవి అసలు పేరు రమణమ్మ… ఆమె కూడా పెద్దలు పెట్టిన పేరు నచ్చక రమాదేవిగా మార్చుకుంది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది. తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలసి పనిచేశారు. రామోజీరావు మరణంతో రాజకీయ, సినీ ప్రముఖులు, సీనియర్ జర్నలిస్టులు, ఎడిటర్లు సంతాపం వ్యక్తం చేశారు.