AP MRO Murder : రీల్ క్యారెక్టర్ …రియల్ గా దించాడు ! ఎమ్మార్వో హత్యకేసులో సంచలన నిజాలు !!

తహశీల్దార్ (Tehsildar) రమణయ్య హత్య కేసు నిందితుడికి సంబంధించిన సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. మురారి సుబ్రమణ్యం గంగారాం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు (Estate Businesses) చేస్తూ ఓ సినిమా ప్రొడ్యూస్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మురారి గంగారాంగా భావిస్తున్న క్యారెక్టర్ ఈ సినిమాలో ఉందని టాక్ వినిపిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2024 | 01:35 PMLast Updated on: Feb 07, 2024 | 1:35 PM

Real Character Real Download Sensational Facts In The Case Of Emmaros Murder

తహశీల్దార్ (Tehsildar) రమణయ్య హత్య కేసు నిందితుడికి సంబంధించిన సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. మురారి సుబ్రమణ్యం గంగారాం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు (Estate Businesses) చేస్తూ ఓ సినిమా ప్రొడ్యూస్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మురారి గంగారాంగా భావిస్తున్న క్యారెక్టర్ ఈ సినిమాలో ఉందని టాక్ వినిపిస్తోంది.

తహశీల్దార్ రమణయ్య (Ramanaiah) హత్య (Murder) కేసులో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడు గంగారాం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తూ ఒక సినిమా ప్రొడ్యూస్‌ చేసినట్టు ప్రచారం నడుస్తోంది. మురారీ పేరు మీదుగా ది నైట్‌ పిక్చర్ తీసినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ సినిమా నాలుగేళ్ల క్రితం నిర్మాణదశలోనే ఆగిపోయింది. మురారి గంగారాంగా భావిస్తున్న క్యారెక్టర్‌ అందులో ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాది అంతా ఓ క్రైమ్ బ్యాక్ గ్రౌండ్. మురారి ప్రెజెంట్స్ (Murari presents) అని ట్రైలర్ లో చూస్తే తెలుస్తోంది. కానీ ఈ చిత్రంలో నటించింది…నిందితుడు మురారి అలియాస్ సుబ్రమణ్యం అలియాస్ గంగారాం ఒకటేనా అని డౌట్ వ్యక్తమవుతుంది. అందులో కనిపిస్తున్న క్రైమ్ సీన్స్ కి ఇతనికి ఏమైనా సంబంధం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గంగారాం గతంని చూస్తే అంతా క్రైమ్ హిస్టరీయే కనిపిస్తుంది. అందుకే క్రైమ్ బ్యాక్ డ్రాప్ సినిమా తీసినట్టుగా ప్రచారం సాగుతోంది.

మురారి సుబ్రహ్మణ్యం గంగారంపై గతంలో కేసులు కూడా నమాదయ్యాయి. తెలంగాణలో సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, విజయవాడలోనూ కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన ఆయన విశాఖకు మూడేళ్ల క్రితం వచ్చేసి ఇక్కడి పనోరమా హిల్స్ లో ఉంటూ రియల్టర్ గా లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. రూరల్ తహశీల్దార్ కార్యాలయ పరిధిలో నిర్మిస్తున్న జూయల్ పార్క్ అపార్ట్మెంట్ నిర్మాణం విషయంలో 22/ఏలోకి వెళ్లిపోయిన ఫ్లాట్ల విషయంలోనూ అతను నిందితుడు. తహశీల్దార్ రమణయ్య -గంగారాం మధ్య లావాదేవీలు నడిపినట్టు చెబుతున్నారు. తాను అప్పటికే కొందరు ఫ్లాట్ల యజమానుల నుంచి సొమ్ము వసూలు చేసి… మొదట రూ.50లక్షలు, ఆ తర్వాత మరో రూ.7లక్షల మొత్తాన్ని రమణయ్యకు నిందితుడు గంగారాం అందజేసినట్లు భావిస్తున్నారు. అయినా గడువులోగా తహసీల్దార్ పని చేయకపోవడం, బొండపల్లికి బదిలీపై వెళ్లిపోవడంతో గంగారాం తరచూ ప్రశ్నించడం మొదలెట్టాడు. చాలాసార్లు తిరిగినా పని కాకపోవడంతో ఈ విషయాన్ని అడిగేందుకే గంగారావు… తహసిల్దార్ రమణయ్య ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.

ఫిబ్రవరి 2 శుక్రవారం రాత్రి రమణయ్యపై దాడి చేసి వెళ్లిపోయిన గంగారాం ఆ రాత్రంతా విశాఖలోనే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. రాడ్ తో కొట్టిన తరువాత రమణయ్య చనిపోతాడనుకోలేదా!.. అందుకే హత్య చేసిన తర్వాత 12 గంటల పాటు విశాఖలోనే ఉండిపోయాడా..!అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శనివారం ఉదయం రమణయ్య చనిపోయినట్టు వార్తలు రావడంతో వెంటనే విమానంలో చెన్నైకు బయలుదేరాడు.. ఆ ఫ్లైట్ విశాఖ నుంచి చెన్నై కు వయా బెంగుళూర్ మీదుగా వెళ్లాల్సింది.. అక్కడ సిబ్బంది నిందితుడు పూర్తి పేరుతో పిలిచే సరికి అనుమానం వచ్చి అక్కడి నుంచి జారుకొని బస్సులో చెన్నైకు పయనమయ్యాడు.. ఈలోగా సెల్ టవర్ ఆధారంగా పోలీసులు అతని ఆచూకీని తెలుసుకున్నారు.