RRR : రఘురామకు రికార్డు మెజారిటీ.. స్పీకర్ అవుతారా.. జగన్‌కు చుక్కలేనా?
ఉండిలో అదిరిపోయే మెజారిటీలో విజయం సాధించారు రఘురామ. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఆయన.. ట్రయాంగిల్ ఫైట్‌లో సూపర్ విక్టరీ అందుకున్నారు. ఉండి టికెట్ విషయంలో టీడీపీలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఉండిలో అదిరిపోయే మెజారిటీలో విజయం సాధించారు రఘురామ. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన ఆయన.. ట్రయాంగిల్ ఫైట్‌లో సూపర్ విక్టరీ అందుకున్నారు. ఉండి టికెట్ విషయంలో టీడీపీలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. తనకు అవకాశం దక్కలేదన్న కోపంతో.. శివరామరాజు టీడీపీ రెబెల్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఐతే ఆయనకు వైసీపీ మద్దతుగా నిలిచిందని… రఘురామను ఓడించేందుకు ప్లాన్ చేసిందనే ప్రచారం జరిగింది. ఇందులో నిజం ఎంత ఉన్నా.. రఘురామ మాత్రం వారెవ్వా అనే రేంజ్ విక్టరీ కొట్టారు. ఏకంగా 56వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.
టీడీపీ రెబెల్ అభ్యర్ధి శివరామరాజు బరిలో ఉన్నా.. రఘురామ విజయాన్ని అడ్డుకోలేకపోయారు. నియోజకవర్గంలో తన సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అప్పటికే వైసీపీ ప్రభుత్వం రఘురామను టార్గెట్ చేసి ఐదేళ్లు ఇబ్బంది పెట్టడంతో.. ఆ సానుభూతి కలిసి వచ్చింది. దీంతో రెబెల్ శివరామరాజు 13వేల ఓట్లు చీల్చినా రఘుురామ 56వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. నిజానికి తనకు 30వేల మెజారిటీ వస్తుందని రఘురామ అన్నారు.. తీరా ఫలితాలు చూస్తే అంచనాలకు మించి 56 వేలు సాధించారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ.. ఆ తర్వాత జగన్ మీద తిరుగుబాటు చేశారు.
మాటలతో టార్చర్ చేసేవారు ఒకరకంగా. ఐతే జగన్ మీద యుద్ధభేరి మోగించిన రఘురామ.. అంతకు అంత బదులిస్తానని బహిరంగంగానే కామెంట్లు చేశారు. మరి ఇప్పుడు ఉండి నుంచి విజయం సాధించిన రఘురామ.. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు.. చంద్రబాబు ఆయనకు కట్టబెట్టే పదవి ఏంటి.. ఆ పదవిని అడ్డుపెట్టుకొని జగన్‌ను రఘురామ ఎలా ఆడుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో జోరు చర్చ జరుగుతోంది. వైసీపీ బాధితుడిగా ఒకప్పుడు ఇబ్బందులు పడ్డ రఘురామరాజును.. అసెంబ్లీలో స్పీకర్‌గా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అసెంబ్లీకి జగన్ ప్రతిపక్షనేతగా వస్తే.. స్పీకర్‌గా ఉంటూ రఘురామ వేసే సెటైర్లు చూడాలనే ఆయన ఫ్యాన్స్ కోరికను చంద్రబాబు నెరవేరుస్తారో లేదో చూడాలి మరి.