బామ్మర్ది షోలు కాదు బాబు ప్రజలను చూడు: రెచ్చిపోయిన రోజా

మా నగరి నియోజకవర్గంలో చిన్నపాపను అత్యంత దారుణంగా రేప్‌ చేసి చంపడం అత్యంత దారుణమైన ఘటన, ప్రభుత్వ చేతకానితనం వల్లే ఇదంతా జరుగుతోంది అంటూ వైసీపీ నేత ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు, అనిత, పవన్‌ కళ్యాణ్‌ సిగ్గుపడాలి,

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 2, 2024 | 01:02 PMLast Updated on: Nov 02, 2024 | 1:02 PM

Roja Sensational Comments On Chandrababu And Pawan Kalyan

మా నగరి నియోజకవర్గంలో చిన్నపాపను అత్యంత దారుణంగా రేప్‌ చేసి చంపడం అత్యంత దారుణమైన ఘటన, ప్రభుత్వ చేతకానితనం వల్లే ఇదంతా జరుగుతోంది అంటూ వైసీపీ నేత ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు, అనిత, పవన్‌ కళ్యాణ్‌ సిగ్గుపడాలి, ఎన్నికల ముందు మీరు చెప్పిందేమిటి, ఇప్పుడు చేస్తున్నదేంటి, ఈ ఐదు నెలల్లో దాదాపు వందమందికి పైగా అత్యాచారాలు, హత్యలు, దారుణాలు జరిగాయని… దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇలా జరుగుతుందా అని నిలదీశారు.

ఆడవారికి చిన్న కష్టం వచ్చినా తొక్కి నార తీస్తానన్న పవన్‌ ఇప్పుడు ఎంతమందిని తొక్కి నార తీశారు, హోంమంత్రి అనిత నువ్వెందుకు అఘాయిత్యాలు ఆపలేకపోతున్నావు, నేరస్ధులకు ఎందుకు భయం కల్పించలేకపోతున్నావు అని ప్రశ్నించారు. చంద్రబాబు…ఆడపిల్ల పుట్టుకనే అవమానించారు, ఆయన సొంత జిల్లాలో ఇది రెండో ఘటన, గతంలో పుంగనూరులో జరిగింది, ఇప్పుడు ఇది రెండోది, ఇబ్బడిముబ్బడిగా లిక్కర్‌ షాపులు, బెల్ట్‌ షాపులు పెడితే మద్యం తాగి ఆ మత్తులో జరుగుతున్నవి కాదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి, రాష్ట్రమంతా గంజాయి, లిక్కర్‌ విచ్చలవిడిగా అమ్ముతున్నారు, నేరస్తుడిని పట్టుకున్నామంటున్నారు కానీ అసలు నేరస్తుడికి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, మీ చేతకానితనం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్‌ నియోజకవర్గం పిఠాపురంలో అఘాయిత్యం జరిగితే ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఆయన పరామర్శించలేదు, బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో అత్తాకోడళ్ళపై దారుణం జరిగితే ఇంతవరకు బాలకృష్ణ పరామర్శించలేదు, లోకేష్‌ నియోజకవర్గంలో 24 గంటల్లో ముగ్గురిని రేప్‌ చేస్తే ఆయన పట్టించుకోలేదు అని విమర్శించారు.

ఆడపిల్లల రక్షణ బాధ్యత ఇకనైనా తీసుకోండి, తప్పు చేస్తే ఉరి తీస్తారన్న భయం కల్పించండి, జగన్‌ గారిపై కక్షతో దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్‌లను నిర్వీర్యం చేశారు అని మండిపడ్డారు. చంద్రబాబు స్పెషల్‌ ఫ్లైట్‌లో అన్‌స్టాపబుల్‌ షోలకు వెళతారు కానీ ఇలాంటి ఘటన దగ్గరకు రారని ఎద్దేవా చేసారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి, ఉరిశిక్ష విధించాలని మేం కోరుతున్నామన్నారు.