RamMohan Naidu : అవమానించిన నోటితోనే శభాష్ అనిపించుకున్నాడు.. రామ్‌మోహన్ నాయుడు స్టైలే వేరు
కింజరాపు రామ్‌మోహన్ నాయుడు (Kinjarapu Ram Mehan Naidu). ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు పొంది అతి కొద్ది మంది నాయకుల్లో రామ్‌మోహన్ నాయుడు ఫ్రంట్ లైన్‌లో ఉంటారు.

Shabhash felt insulted with his mouth.. Rammohan Naidu's style is different
కింజరాపు రామ్‌మోహన్ నాయుడు (Kinjarapu Ram Mehan Naidu). ప్రత్యర్థుల నుంచి కూడా ప్రశంసలు పొంది అతి కొద్ది మంది నాయకుల్లో రామ్‌మోహన్ నాయుడు ఫ్రంట్ లైన్‌లో ఉంటారు. తన పని తాను చేసుకుంటూ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం తప్ప.. చిల్లర రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు లేదు. అలాంటి క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టే.. అతి చిన్న వయసులో మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు రామ్‌మోహన్ నాయుడు. ఇక్కడే ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో బీజేపీ (BJP) తో సంబంధాలు సరిగ్గా లేని సమయంలో రామ్‌మోహన్ నాయుడు పార్లమెంట్ (Parliament) సాక్షిగా అసహనం వ్యక్తం చేశారు. ముగ్గురు సభ్యులే ఉన్నారని తమను చిన్న చూపు చూస్తున్నారని.. ఏదో ఒకరోజు పిలిచి మరీ మాట్లాడమని అడిగే స్థాయి వస్తామంటూ సవాల్ చేశారు. అన్నట్టుగానే ఇప్పుడు ఎన్డీలో రెండో అతిపెద్ద పార్టీ నుంచి ఎంపీగా పార్లమెంట్‌లో స్పీచ్ ఇవ్వబోతున్నారు రామ్‌మోహన్ నాయుడు. చదువు పరంగా కూడా రామ్‌మోహన్ నాయుడు వెల్ ఎడ్యుకేటెడ్. లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన రామ్‌మోహన్ నాయుడు 2012లో తన తండ్రి ఎర్రన్నాయుడు మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఎర్రన్నాయుడి వారసుడిగా 2014లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుగా మూడు సార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
దీంతో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో (NDA alliance) భాగంగా మోడీ కేబినెట్‌లో రామ్‌మోహన్ నాయుడికి స్థానం లభించింది. ఇక్కడ మరో హైలెట్ పాయింట్ ఏంటి అంటే.. మోడీ కేబినెట్‌లో (Modi Cabinet) అతి తక్కువ వయసున్న యంగ్ మినిస్టర్ రామ్‌మోహన్ నాయుడే. ఆయన ఏజ్ జస్ట్ 36. గతంలో మేఘాలయకు చెందిన అగతా సంఘ్మా.. 29 ఏళ్ల వయసులో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే ఆమె గ్రామీణాభివృద్ధి శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. కానీ రామ్‌మోహన్ నాయుడు మాత్రం ఏకంగా కేబినెట్ మంత్రిగా స్థానం దక్కించుకున్నారు. గతంలో రామ్‌మోహన్ నాయుడి తండ్రి ఎర్రన్నాయుడు కూడా 1996లో అతి చిన్న వయసున్న కేంద్ర మంత్రిగా రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు రామ్‌మోహన్ నాయుడు కూడా తండ్రి బాటలోనే అదే రికార్డ్‌ను బ్రేక్ చేశారు. ఏది ఏమైనా ఎక్కడ అవమానపడ్డాడో అక్కడి మంత్రి నిలబడం చాలా తక్కువ మందికి సాధ్యమయ్యే విషయం.