Ketireddy VS Sharmila : కేతిరెడ్డికి దెబ్బేసిన షర్మిల… జగన్‌కు సూపర్ పంచ్…
ఓటమిపై వైసీపీ (YCP) పోస్టుమార్టం మొదలుపెట్టింది. సొంత పార్టీలోనే ఇప్పుడు భిన్నస్వరాలు వినిపిస్తున్నాయ్. కోటరీ జగన్‌ను మోసం చేసిందని.. గ్రౌండ్‌లెవల్‌కు పార్టీ అధినేతను దూరం చేసిందని.. ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో క్లియర్‌గా కనిపించిందని.. మొన్న జక్కంపూడి రాజా, ఇవాళ కేతిరెడ్డి (Ketireddy Venkatrami Reddy) డైరెక్ట్ కామెంట్లు చేశారు.
ఓటమిపై వైసీపీ (YCP) పోస్టుమార్టం మొదలుపెట్టింది. సొంత పార్టీలోనే ఇప్పుడు భిన్నస్వరాలు వినిపిస్తున్నాయ్. కోటరీ జగన్‌ను మోసం చేసిందని.. గ్రౌండ్‌లెవల్‌కు పార్టీ అధినేతను దూరం చేసిందని.. ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో క్లియర్‌గా కనిపించిందని.. మొన్న జక్కంపూడి రాజా, ఇవాళ కేతిరెడ్డి (Ketireddy Venkatrami Reddy) డైరెక్ట్ కామెంట్లు చేశారు. వీళ్ల కామెంట్ల సంగతి ఎలా ఉన్నా.. వైసీపీ నుంచి గెలుపు గ్యారంటీ అనుకునే బ్యాచ్‌లో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉండేవారు.
గుడ్ మార్నింగ్ ధర్మవరం (Dharmavaram) అంటూ.. ప్రతీ ఇంటికి వెళ్తూ.. ప్రతీ ఓటర్‌ను పలకరిస్తూ.. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే ఆయన చాలా కష్టపడ్డారు. భూకబ్జాలు అని రకరకాల ఆరోపణలు వినిపించినా.. ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ.. జనాల్లో ఉంటూ.. జనంతో ఉంటూ.. విజయం ఖాయం అన్నట్లు కనిపించారు. కట్ చేస్తే.. ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది. చిన్న మార్జిన్‌తో కేతిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఫలితాల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేతిరెడ్డి చాలా ఎమోషనల్ అయ్యారు. ఏం తక్కువ చేశానని.. ఏం తప్పు చేశానని ఓడించారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఐతే కేతిరెడ్డి ఓటమికి షర్మిలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. షర్మిలను జగన్ లైట్ తీసుకోవడం.. కేతిరెడ్డికి విజయాన్ని దూరం చేసింది.
ఈ ఎన్నికల్లో కేతిరెడ్డి కేవలం 3వేల 734 ఓట్ల తేడాతో.. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ చేతిలో ఓడిపోయారు. ఐతే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అశ్వర్థ నారాయణకు 3వేల 758 ఓట్లు వచ్చాయ్. ఈ ఓట్లు అక్కడ అభ్యర్థిని చూసి పడలేదు అన్నది క్లియర్. షర్మిల పేరు వినో, మొహం చూసో ఈ ఓట్లు వేసి ఉంటారు. ఇలా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓటమికి.. షర్మిల ప్రధాన కారణంగా మారింది. షర్మిలను లైట్ తీసుకొని.. జగన్ ఎంత తప్పు చేశారో.. ఈ ఫలితాల ద్వారా క్లియర్‌కట్‌గా అర్థం అయింది. జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్.. వైసీపీ ఘోర పరాభవానికి కారణం అయింది. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా.. రాయలసీమలో జగన్‌ను, వైసీపీని భారీగా దెబ్బతీసింది షర్మిల. ఓట్లను భారీగా చీల్చింది. సీమ జిల్లాల్లోనూ వైసీపీ ఏ మాత్రం ప్రబావం చూపించలేదు అంటే. దానికి ప్రధాన కారణం.. షర్మిలే అనడంలో ఎలాంటి అనుమానం లేదు.