YS Sharmila : ఎన్నికల వేళ షర్మిల కీలక నిర్ణయం..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇంచార్జిలను మారుస్తూ జగన్ (CM Jagan) సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటే.. సీట్ల సర్దుబాటుపై టీడీపీ(TDP), జనసేన (Janasena) మధ్య చర్చలు పీక్స్‌కు చేరాయ్. ఈ రెండు పార్టీల సంగతి ఎలా ఉన్నా.. షర్మిల మాత్రం మహా దూకుడు మీద కనిపిస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఇంచార్జిలను మారుస్తూ జగన్ (CM Jagan) సంచలన నిర్ణయాలు తీసుకుంటుంటే.. సీట్ల సర్దుబాటుపై టీడీపీ(TDP), జనసేన (Janasena) మధ్య చర్చలు పీక్స్‌కు చేరాయ్. ఈ రెండు పార్టీల సంగతి ఎలా ఉన్నా.. షర్మిల మాత్రం మహా దూకుడు మీద కనిపిస్తున్నారు. సీఎం జగన్ లక్ష్యంగా ఆమె గుప్పిస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అటు ఫ్యామలీ నుంచి ఇటు రాజకీయాల వరకు.. ప్రతీ విషయాన్ని హైలైట్ చేస్తూ… వైసీపీ (YCP) శ్రేణులకు సిద్ర లేకుండా చేస్తున్నారు షర్మిల. కేంద్రంలోని బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా ప్రత్యేక హోదా కోసం దీక్షలు చేపట్టి.. తన దూకుడు ఏంటో పరిచయం చేసే ప్రయత్నం చేశారు.
ఇక ఎన్నికల వేళ.. షర్మిల (Sharmila) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మొత్తం జనాల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం నిరసన చేసిన షర్మిల.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా జనాల్లోకి వెళ్లనున్నారు. దీనికి తొలి విడతగా ఫిబ్రవరి 5 నుంచి 10వ తేదీ వరకు టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఏపీలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్న వేళ.. అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్దమవుతోంది. దీని కోసం ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పుడు, షర్మిల జిల్లాల పర్యటనలకు సిద్దమయ్యారు. 5న మడకశిర నుంచి షర్మిల యాత్ర ప్రారంభం కానుంది. రచ్చబండలు, బహిరంగ సభల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేశారు.
5వ తేదీ సాయంత్రం ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిరలో బహిరంగ సభ జరుగుతుంది. ఆ తర్వాత రోజు శింగనమల అసెంబ్లీ స్థానం పరిధిలోని బండ్లపల్లిలో రచ్చబండ కార్యక్రమం చేపడతారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో బహిరంగ సభ ఉంటుంది. ఇలా పదో తేదీ వరకు.. ప్రతీ రోజు ఒక నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పదో తేదీ నర్సీపట్నంలో రచ్చబండ, సాయంత్రం ఐదు గంటలకు పాడేరు బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.