AP Politics : రఘురామను వెంటాడుతున్న శివరామరాజు.. ఉండిలో సంచలనం ఖాయమా…
ఉండి.. కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో పదేపదే వినిపిస్తున్న పేరు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ.. ఆ తర్వాత ఆ పార్టీకే రెబెల్‌గా మారడం.. సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేయడం..
ఉండి.. కొద్దిరోజులుగా ఏపీ రాజకీయాల్లో పదేపదే వినిపిస్తున్న పేరు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ.. ఆ తర్వాత ఆ పార్టీకే రెబెల్‌గా మారడం.. సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేయడం.. బీజేపీ నుంచి టికెట్ ఆశించడం.. కమలం పార్టీ హ్యాండ్ ఇవ్వడంతో మొదలైంది ఉండి చర్చ. ముగ్గురు రాజుల ముచ్చటైన యుద్ధం అంటూ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు.. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మధ్య పోటీ జరుగుతుండగానే.. మధ్యలో రఘురామరాజు వచ్చి చేరారు. ఐతే బీజేపీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత రఘురామను టీడీపీలో చేర్పించుకొని.. ఉండి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఐతే ఫస్ట్ లిస్ట్‌లోనే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు స్థానాన్ని కేటాయించిన చంద్రబాబు..
ఆ తర్వాత రామరాజును బుజ్జగించి.. అధికారికంగా రఘురామ పేరు ప్రకటించారు. ఐతే శివరామరాజు మాత్రం.. టీడీపీ రెబెల్‌గా మారారు. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్ వేశారు. ఐతే చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి.. ఆయనను బుజ్జగిస్తారని.. శివరామరాజు మనసు మార్చుకుంటారని అనుకుంటే.. మేకులా మారారు ఆయన ! ఉండి అసెంబ్లీ పోరులో కొనసాగుతున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీని, రఘురామను టెన్షన్ పెడుతోంది. 2009, 2014లో శివరామరాజు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఐతే టీడీపీ కేడర్‌లో శివకు మంచి పేరు ఉంది. అందరితో కలిసిమెలిసి ఉంటారనే పేరు ఉంది.
ఇదే టీడీపీకి ఇబ్బందిగా మారే చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. రామరాజు, శివరామరాజును కాదని.. ఉండితో సంబంధం లేని రఘురామకు టికెట్ కేటాయించడాన్ని.. స్థానికంగా మెజారిటీ టీడీపీ కేడర్ అసంతృప్తితో ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. వీళ్లంతా శివరామరాజు వైపు మళ్లితే.. పరిస్థితి రఘురామకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. ఏమైనా ఇప్పుడు పోటీలో ఉన్న శివరామరాజు.. భారీగా ఓట్లు చీల్చే చాన్స్ ఉందని.. అదే జరిగితే కంచుకోటలాంటి స్థానాన్ని టీడీపీ కోల్పోయే ప్రమాదం ఉందనే వార్నింగ్స్ వినిపిస్తున్నాయ్. దీంతో ఉండిలో ఏం జరగబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.