Janasena, Ram Charan : బాయ్ కోసం కొడుకు ప్రచారం.. తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyana) కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు పిఠాపురం నియోజకవర్గంకు వేళ్లనున్నా.. గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్(Ram Charan). తన తల్లి సురేఖ (Surekha) తో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.

Son's campaign for Boy.. Ram Charan went to Pithapuram with his mother
జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyana) కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు పిఠాపురం నియోజకవర్గంకు వేళ్లనున్నా.. గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్(Ram Charan). తన తల్లి సురేఖ (Surekha) తో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. తన బాబాయ్, జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో చరణ్ అక్కడికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. జనసేనాని పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ కానున్నారు. దీంతో ఆయన పవన్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తన బాబాయికి మద్దతు తెలిపిన చరణ్.. పవన్ గెలుపు కోసం తనవంతుగా ఇవాళ ఎన్నికల ప్రచారం చేస్తారా? లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది.
కాగా ఇప్పటికే పవన్ గెలుపు కోసం టాలీవుడ్, నుంచి అనేక సిని నటులు, ఆర్టిస్టులు, జబర్తస్త్ నటులు స్వచ్ఛందంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ (Allu Arjun) సోషల్ మీడియా వేదికగా పవన్ కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.. మరో వైపు పవన్ కల్యాణ్ అన్న మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి సైతం తన తమ్ముడి గెలుపు కోసం పిఠాపురం ప్రజలకు ఓ వీడియో సందేశం పంపించారు.
Suresh SSM