Pithapuram Pawan Kalyan : పిఠాపురంలో స్టిక్కర్ ఫైట్.. పిచ్చి బాగా ముదిరిందెహే…
ఏపీలో అందరి ఆసక్తి.. ఇప్పుడు పిఠాపురం (Pithapuram) మీదే. పవన్ గెలుస్తారా.. అసెంబ్లీ (AP Assembly Elections) లో ఈసారైనా అడుగుపెడతారా లేదా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో.. పవన్ కల్యాణ్ గెలుపు ఖాయం అని జనసేన (Jana Sena) కార్యకర్తలు, పవర్ స్టార్ (Power Star) అభిమానులు ఫిక్స్ అయ్యారు.
ఏపీలో అందరి ఆసక్తి.. ఇప్పుడు పిఠాపురం (Pithapuram) మీదే. పవన్ గెలుస్తారా.. అసెంబ్లీ (AP Assembly Elections) లో ఈసారైనా అడుగుపెడతారా లేదా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో.. పవన్ కల్యాణ్ గెలుపు ఖాయం అని జనసేన (Jana Sena) కార్యకర్తలు, పవర్ స్టార్ (Power Star) అభిమానులు ఫిక్స్ అయ్యారు. ముందుగానే సంబరాలు మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ఇక్కడితో ఆగితే బాగుండేదేమో.. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ.. స్టిక్కర్లు అతికించుకుంటున్నారు చాలామంది ఫ్యాన్స్. కారుకో, బైక్ డోముకో అతికించుకుంటే పర్లేదు.. నంబర్ ప్లేట్ మొత్తం కవర్ చేస్తున్నారు.
ఇలాంటి బైక్‌లు పిఠాపురంలో చాలానే కనిపిస్తున్నాయ్. ఒకరిని చూసి మరొకరు ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా పవన్ ఇక్కడ విజయం సాధించేశారని వారు డిసైడ్ అయ్యారు. అందుకే మా ఎమ్మెల్యేగారు అంటూ హడావిడి చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ఇలా ఉంటే.. వైసీపీ వాళ్లు కూడా అలానే కనిపిస్తున్నారు. వీళ్లు అర్దణా అంటే.. వాళ్లు అణా అంటున్నట్లు ఉంది పరిస్థితి. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ స్టిక్కర్లు అతికించుకుంటే.. డిప్యూటీ సీఎం గీతా అంటూ కార్ల మీద రాసుకొని తిరుగుతున్నారు వైసీపీ నేతలు. 2024 రాజన్న వన్స్ మోర్ అని ట్యాగ్‌లైన్ కూడా రాసుకుంటున్నారు. ఈ స్టిక్కర్లతో అటు జనసేన, ఉటు వైసీపీ అభిమానులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.
తమ నాయకులే గెలిచేశారని.. ఒక్క స్టిక్కర్‌తో తేల్చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. పిఠాపురంలో ఫలితం అనుకున్నంత ఈజీగా ఉండదు అనే చర్చ జరుగుతోంది. ఎవరు గెలిచినా మెజార్టీ అతి తక్కువ ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. వారం రోజుల్లో రిజల్ట్ రాబోతున్న సమయంలో.. అటు జనసేన, ఇటు వైసీపీ అభిమానులు మాత్రం ఓ రేంజ్‌లో హడావుడి చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంకొందరయితే.. నంబర్ ప్లేట్ ప్లేసులో అతికించిన స్టిక్కర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ట్రాఫిక్ పోలీసులను ట్యాగ్ చేస్తున్నారు.