Swarupananda Swamy : ప్లేట్ ఫిరాయించిన స్వరూపానంద.. ఆడుకుంటున్న జనాలు.. ఇంత వైల్డ్‌గా ఉన్నారేంటి..
ప్లేటు ఫిరాయించడం.. రాజకీయాల్లో చాలా కామన్.. అధికారం ఎటు ఉంటే అటు ఈజీగా యూటర్న్ తీసుకుంటరు. అంతే ఈజీగా నాలుకలు మడతపెట్టేస్తుంటారు. ఒకరోజు ఒక పార్టీలో ఉంటారు.. మరో రోజు మరో పార్టీలోకి వెళ్లిపోతుంటారు.
ప్లేటు ఫిరాయించడం.. రాజకీయాల్లో చాలా కామన్.. అధికారం ఎటు ఉంటే అటు ఈజీగా యూటర్న్ తీసుకుంటరు. అంతే ఈజీగా నాలుకలు మడతపెట్టేస్తుంటారు. ఒకరోజు ఒక పార్టీలో ఉంటారు.. మరో రోజు మరో పార్టీలోకి వెళ్లిపోతుంటారు. విలువల గురించి మాట్లాడుకోకపోవడమే బెటర్ అనే పరిస్థితి వచ్చేసింది. రాజకీయం అంతే.. రాజకీయంలో అంతే అని జనాలు కూడా అడ్జస్ట్ అయిపోయారు. ఐతే రాజకీయ నేతలే కాదు.. స్వామీజీలు కూడా ఇలా ప్లేటు ఫిరాయించడం..
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకే ఆశీస్సులు, ఆ పార్టీతోనే ఉంటాం అన్నట్లుగా బిల్డప్‌లు ఇచ్చే స్వామీజీలు.. ఆ పార్టీ ఓడిపోగానే దాన్ని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజి తీరు ఇలాగే ఉంది. శారదాపీఠం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ రాజశ్యామల యాగాలతో చాలా ఫేమస్. రాజకీయ నాయకులు కూడా ఆయనతో మంచిగా ఉంటారు. ఎన్నికలకు వెళ్లేముందు. గెలిచిన తర్వాత వెళ్లి స్వామీజీ దర్శనం చేసుకుంటూ ఉంటారు. స్వామీజీ కూడా రాజకీయ నాయకులతో స్వామీజీలాగా కాకుండా ఆత్మబంధువులా ప్రవర్తిస్తుంటారు. ఆశీర్వదిస్తుంటారు కూడా ! సహజంగా నేతలతో, ఇతరుతో ఇంత సన్నిహితంగా స్వామీజీలు ఉండరు. కానీ స్వరూపానందేంద్ర స్వామీజీ రూటు మాత్రం సెపరేటు.
వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో స్వరూపానందేంద్ర స్వామీజీకి సాన్నిహిత్యం ఎక్కువ. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఆయన ప్రవర్తనపై ఎన్నో విమర్శలు వచ్చాయ్. అయినా వాటిని ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. జగన్‌ను ఆకాశానికెత్తేవారు. ఐతే ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది. స్వామీజీ కూడా మాట మార్చేశారు. ఏకంగా ఆయన విశాఖలో ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబుతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో దేవాదాయ వ్యవస్థ సరిగా లేదన్నారు. తాను చెప్పినా వినకపోవడం వల్లే ఓడిపోయారని ప్లేట్ ఫిరాయించారు. చంద్రబాబు పరిపాలనా దక్షుడని.. ఆయని ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. ఇంత త్వరగా ప్లేట్ ఫిరాయించడం ఏంటి.. ఇదేందయ్యా ఇదీ అంటూ.. సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు.