TDP ON JR NTR : తారక్ ను కెలుకుతున్న టీడీపీ.. రెచ్చిపోతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్
జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఫలితాలు రాబోతున్నాయి. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఇక రాబోయే ఐదేళ్ళ పాటు తమదే రాజ్యం అనుకుంటున్నారు. అందుకేనేమో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని కెలుకుతున్నారు. టీడీపీతో విభేదించిన జూనియర్ గత కొన్నేళ్ళుగా ఆ పార్టీతో పాటు బాబాయ్ బాలకృష్ణ, మామ చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు.
జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఫలితాలు రాబోతున్నాయి. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న ధీమా టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. ఇక రాబోయే ఐదేళ్ళ పాటు తమదే రాజ్యం అనుకుంటున్నారు. అందుకేనేమో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ని కెలుకుతున్నారు. టీడీపీతో విభేదించిన జూనియర్ గత కొన్నేళ్ళుగా ఆ పార్టీతో పాటు బాబాయ్ బాలకృష్ణ, మామ చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు. తన సినిమాలేవో తాను చేసుకుంటున్నారు. అయితే టీడీపీ, జూనియర్ ఫ్యాన్స్ మధ్య మాత్రం రచ్చ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతోంది.
ఇప్పుడు తాజాగా నందమూరి చైతన్య కృష్ణ… జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని హెచ్చరిస్తూ మాట్లాడారు. మా మామ చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలకృష్ణ జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిన్న గాక మొన్న ఊరూ పేరూ లేని సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈయనపై తారక్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. చైతన్య కృష్ణ ఈ స్టేట్ మెంట్ ఇవ్వడానికి ఒక్క రోజు ముందే జూనియర్ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెప్పారు నారా లోకేష్. చైతన్య కృష్ణ చేసిన యాగీ చాలదన్నట్టు…బెజవాడ టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్స్ చేశారు. టీడీపీకి తారక్ కి సంబంధం లేదనీ… 2014, 19, 24 ఎన్నికల్లో టీడీపీ కోసం జూనియర్ ప్రచారం చేయలేదు. అందువల్ల ఆయనకు పార్టీతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. అసలు మొన్నటి ఎన్నికల్లో తారక్ ఏ పార్టీకీ, ఏ నాయకుడికీ మద్దతీయలేదు. కనీసం మెస్సేజ్ కూడా పెట్టలేదు.
వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు జూనియర్ పేరును వాడుకున్నారు. ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. కొందరు వైసీపీ లీడర్లు జూనియర్ ఎన్టీఆర్ కి అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇచ్చినా… తారక్ ఏనాడూ వాటి జోలికి పోలేదు. తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. RRR తో మంచి గుర్తుంపు తెచ్చుకున్న ఆయన… పాన్ ఇండియా మూవీస్ పై దృష్టి పెట్టారు. కానీ చైతన్య కృష్ణ, బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు… జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను లేపి మరీ తన్నించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ రేపిన చిచ్చుతో మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్న తారక్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. టీడీపీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య మళ్ళీ సోషల్ మీడియా వార్ నడుస్తోంది. టీడీపీ హైకమాండ్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఎక్కడి దాకా వెళ్తుందో తెలియని పరిస్థితి ఉంది.