TDP RAJYASABHA: ఎన్నికల ముందు జగన్‌కు షాక్..! బాబు ప్లాన్ మామూలుగా లేదు..

ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మార్చి నెలలో ఈ ఎన్నికలు పూర్తవుతాయి. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అసెంబ్లీలో ఉన్న బలాలను పరిశీలిస్తే.. ప్రతి 40 మంది ఎమ్మెల్యేలు ఓ ఎంపీని ఎన్నుకునే అవకాశం ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 16, 2024 | 03:28 PMLast Updated on: Jan 16, 2024 | 3:28 PM

Tdp Leader Chandrababu Naidu Super Scetch To Elect Rajyasabha Mp

TDP RAJYASABHA: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్‌కు గట్టి షాక్ ఇవ్వబోతున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు భారీ స్కెచ్ వేశారు. అసెంబ్లీలో బలం లేకపోయినా.. వైసీపీ అసంతృప్తులను దగ్గరకు తీసుకొని వైసీపీని దెబ్బతీయబోతున్నారు. ఈ కీలక ఆపరేషన్ కోసం కొందరు టీడీపీ సీనియర్లను బాబు రంగంలోకి దించినట్టు సమాచారం. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మార్చి నెలలో ఈ ఎన్నికలు పూర్తవుతాయి. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.

Chandrababu Naidu: ప్రస్తుతానికి నో రిలీఫ్! తీర్పుపై భిన్నాభిప్రాయాలు.. CJI ముందుకు క్వాష్ పిటిషన్..

అసెంబ్లీలో ఉన్న బలాలను పరిశీలిస్తే.. ప్రతి 40 మంది ఎమ్మెల్యేలు ఓ ఎంపీని ఎన్నుకునే అవకాశం ఉంది. అంటే మూడు సీట్లు కూడా వైసీపీయే గెలుచుకుంటుంది. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం జగన్ అనేక నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేశారు. దాంతో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్నారు. వీళ్ళల్లో చాలా మంది టీడీపీ లేదా జనసేన కూటమిలో చేరాలని డిసైడ్ అయ్యారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితినే చంద్రబాబు తమకు అనుకూలంగా ఉపయోగించుకోబోతున్నారు. టీడీపీ తరపున రాజ్యసభ అభ్యర్థిని రంగంలోకి దించాలని నిర్ణయించారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. టీడీపీ 23 స్థానాలు గెలిచింది. జనసేనకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. టీడీపీకీ చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. వైసీపీలో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించారు. టీడీపీకి ఉన్న 23 సీట్లకు తోడుగా మరో 17 మందిని ఆకర్షించగలిగితే చాలు. ఒక రాజ్యసభ స్థానం తెలుగుదేశం గెలుచుకునే అవకాశముంది. అందుకే అసంతృప్తిగా ఉన్న పాతిక మంది వైసీపీ సిట్టింగ్స్‌ని ఆకట్టుకునే పనిలో ఉన్నారు టీడీపీ సీనియర్ నేతలు.

బలమైన, భారీగా ఖర్చు చేయగల ఓ అభ్యర్థిని రాజ్యసభకు పోటీలో పెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. భారీగా ఖర్చు పెడితే విజయం తమదే అని భావిస్తున్నారు. అలాంటి అభ్యర్థిని వెతికే పనిలో ఉన్నారు సీనియర్ నేతలు. గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇలాగే ఊహించని విధంగా టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. మొత్తం ఆరు స్థానాలు ఖాళీ అయితే.. అన్నీ వైసీపీయే గెలుచుకునే ఛాన్సున్నా.. ఆరో స్థానానికి పోటీ పెట్టింది టీడీపీ. వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరగడంతో ఈ విజయం దక్కింది. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లోనూ ఇలాంటి వ్యూహాన్నే టీడీపీ అమలు చేయబోతుంది. చంద్రబాబు ప్లాన్ అడ్డుకోడానికి వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎలాంటి కౌంటర్ ప్లాన్ అమలు చేస్తారన్నది చూడాలి.