TDP : టీడీపీ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌.. గెలుపు అంత ఈజీ కాదు..

ఏపీలో ఏ టీడీపీ లీడర్‌ను టచ్‌ చేసినా ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ పొంగిపొర్లుతోంది. యువనేత, రెడ్ బుక్ లీడర్ లోకేష్.. క్యాడర్‌ని ఉత్సాహపరచడానికి.. మాట్లాడే మాటలతో టాప్ టు బాటమ్ లీడర్లంతా పార్టీ ఇక పవర్‌లోకి రావడమే ఆలస్యం అన్నట్లు ఆవేశ పడిపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం వేవ్ ఉంది మనల్ని ఎవ్వడు ఆపలేడు.. అసలు మనకి జనసేన సపోర్ట్ అక్కర్లేదు, బీజేపీ సపోర్ట్ అసలే అక్కర్లేదు, సింగిల్ గా కొట్టేస్తాం... సింగిల్ హ్యాండ్ తో పవర్ లోకి వస్తాం అంటూ టీడీపీ లీడర్స్, క్యాడరు ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2024 | 05:30 PMLast Updated on: Feb 18, 2024 | 5:30 PM

Tdp Over Confidence Victory Is Not So Easy

 

 

 

ఏపీలో ఏ టీడీపీ లీడర్‌ను టచ్‌ చేసినా ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ పొంగిపొర్లుతోంది. యువనేత, రెడ్ బుక్ లీడర్ లోకేష్.. క్యాడర్‌ని ఉత్సాహపరచడానికి.. మాట్లాడే మాటలతో టాప్ టు బాటమ్ లీడర్లంతా పార్టీ ఇక పవర్‌లోకి రావడమే ఆలస్యం అన్నట్లు ఆవేశ పడిపోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం వేవ్ ఉంది మనల్ని ఎవ్వడు ఆపలేడు.. అసలు మనకి జనసేన సపోర్ట్ అక్కర్లేదు, బీజేపీ సపోర్ట్ అసలే అక్కర్లేదు, సింగిల్ గా కొట్టేస్తాం… సింగిల్ హ్యాండ్ తో పవర్ లోకి వస్తాం అంటూ టీడీపీ లీడర్స్, క్యాడరు ఓపెన్ గానే మాట్లాడేస్తున్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం వాళ్లయితే ఇంకా రెండు నెలలు మాత్రమే ఓపిక పట్టాలి ఆ తర్వాత మనం ఏంటో అర్థం అవుతది, మన సత్తా ఏంటో తెలుస్తుంది.. అని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు.

ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చేస్తామా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఏపీలో జగన్ యాంటీ వేవ్ ఉందన్నమాట వాస్తవం. అయితే అది టిడిపిని అధికారంలోకి తెచ్చేంత ఉందా అన్నది ఇప్పుడు ప్రశ్న. ఓవర్ కాన్ఫిడెన్స్ తో టిడిపి అసలుకే ఎసరు తెచ్చుకుంటుందా ?అని పార్టీలోనే కొందరు సీనియర్ నేతలు చెవులు కోరుకుంటున్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు మాత్రమే ఎటువంటి ప్రగల్బాలు లేకుండా తన పని తాను చేసుకెళ్తున్నాడు. తెరవెనక పని చక చక కానిచేస్తున్నాడు. ఇక్కడ ఆయన అనుభవం స్పష్టంగా తెలుస్తోంది. మిడిల్ రేంజ్ లీడర్లు, మిడిమిడి జ్ఞానం నాయకులు, కమ్మ సామాజిక వర్గం ప్రతినిధులు మాత్రం అప్పుడే కొత్త బట్టలు కొనుక్కొని, కేకులకి ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా లోకేష్ వెంట తిరిగే చెంచా బ్యాచ్ మేము అధికారంలోకి రావడమే ఆలస్యం వాడి పని అయిపోద్ది, వీడి పని అయిపోద్ది అని ఎక్కడలేని ప్రగల్బాలని పలుకుతున్నారు. ఇలా చేసే 2009లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో, అత్యుత్సాహంతో టిడిపి అధికారాన్ని దక్కించుకోలేకపోయింది.

ఇప్పుడు మళ్లీ అదే పొరపాటు జరుగుతోంది. టీడీపీలో ఒక వర్గం ఊహిస్తున్నట్లుగా రాష్ట్రంలో విపరీతమైన జగన్ వ్యతిరేక వేవ్ ఏమీ లేదు. సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్లలో, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా జగన్ పై ఆపేక్ష అలాగే ఉంది. లిక్కర్లో జగన్ కుటుంబం ఎంత తిన్నది, ఇసుకలో లో ఎంత మెసెసింది, అదా నీకి ఏమేమి మేలు చేసింది ఇవన్నీ కింది స్థాయిలో ఉండే జనానికి అనవసరం పట్టించుకోరు కూడా. రోడ్లు వేశారా లేదా, కొత్త యూనివర్సిటీలు పెట్టారా లేదా, ఐటీ కంపెనీలు వచ్చాయా లేదా ఇవన్నీ కిందిస్థాయి జనానికి అనవసరం. వీళ్లంతా ఇప్పటికీ వైసీపీ తోనే ఉన్నారు. ఆ విషయాన్ని టీడీపీలోని ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ బ్యాచ్ గుర్తిస్తే మంచిది. అంతేకాదు రాయలసీమలోని 52 సీట్లలో కనీసం 42 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఇప్పటికీ బలంగా ఉంది. అంటే వైసీపీ నెంబరు రాబోయే ఎన్నికల్లో కనీసం 40 నుంచి మొదలవుతుంది. ఉత్తరాంధ్ర, తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రమే జనసేన ప్రభావం వల్ల వైసిపి బాగా దెబ్బ తినే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ ఐదు పాత జిల్లాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో వైసీపీ దారుణంగా ఏమీ దెబ్బ తినలేదు. అంతేకాదు పోల్ మేనేజ్మెంట్ లో ఇప్పటికీ వైసీపీ చాలా బలంగా ఉంది. ఆర్థికంగా భారతదేశంలోనే అత్యంత బలమైన పార్టీ వైసిపి. రేపు ఓటుకి అవసరమైతే 5000 రూపాయలు కూడా ఇచ్చి కొనగలుగుతుంది. నెల్లూరు ప్రకాశం ,గుంటూరు ,కృష్ణ జిల్లాల్లో ఆ పార్టీ పూర్తిగా బలహీన పడిపోలేదు. ఈ కారణాలన్నీ తెలియకుండా టిడిపిలో ఒక వర్గం చొక్కా కాలర్లు పైకి లేపి కుర్చీలు మడత పెట్టేస్తామంటూ హంగామా చేస్తుంది. ప్రాక్టికల్ గా చూసినప్పుడు ఇప్పటికీ టిడిపికి 38% కన్నా ఓటు బ్యాంకు ఎక్కడ పెరగలేదు. జనసేన ను కలుపుకుంటే మాత్రమే పార్టీకి 48 శాతం వరకు ఓటు బ్యాంకు వస్తోంది. అయితే ఇది అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా లేదు.

ఈ విషయం తెలియని చాలామంది టీడీపీ యువ నాయకులు అధికారం రాగానే ఏ ఏ పనులు చేసుకోవాలని అప్పుడే లిస్టులు రాసుకుంటున్నారు. ఈ అత్యుత్సాహం వల్లనే గతంలో దెబ్బతిన్నారు.
ఇప్పుడు అత్యుత్సాహం చూపించి దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. రావడం గ్యారెంటీ కనక జోబుల్లోంచి డబ్బులు తీయకూడదని, అభ్యర్థులు చతి ఖర్చు పెట్టించాలని అధిష్టానం భావిస్తే దారుణంగా దెబ్బతినడం ఖాయం. అంతేకాదు .,. వైసీపీ వ్యతిరేక ప్రచారం, జగన్ పై ఉన్న యాంటీ వేవ్ తమను కాపాడుతాయని అందువల్ల ప్రచారం కోసం ఒక్క రూపాయి జేబులోంచి తీసి ఖర్చు పెట్టక్కర్లేదని భావిస్తున్నారు టీడీపీ నేతల్లో కొందరు. ప్రచారం కోసం స్థానిక నాయకుల్ని బాదేస్తుంది టిడిపి అధిష్టానం. సరే ఇవన్నీ పార్టీ అంతర్గత వ్యవహారాలు. అసలు గెలుపు పై టీడీపీ కి అంత ధీమా ఎందుకో అర్థం కావడం లేదు. నాలుగున్నర సంవత్సరాలుగా చంద్రబాబు చేస్తున్న అండర్ కవర్ ఆపరేషన్, ప్రతిరోజు ప్రజా వ్యతిరేకత సృష్టిస్తూ దాన్ని పెంచుకుంటూ పోతూ ఆయన చేసిన విస్తృత కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది.

ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రత్యర్థి చాలా బలవంతుడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. జనంలో ఒక వర్గం ఇప్పటికీ జగన్ తోనే ఉందని గుర్తుపెట్టుకోవాలి. టీడీపీలో అడుగడుగునా ఆ నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇక తమ గెలుపునివ్వరు అడ్డుకోలేరని, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వేవ్ నడుస్తోందని పూర్తి నమ్మకంతో ఉన్నారు లోకేష్ అండ్ బ్యాచ్. ఇదే నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే 2009, 2019 లో జరిగినట్లే మళ్లీ పాత కదే టీడీపీకి పునరావృతం అవుతుంది. మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తుంది.