MP Keshineni Nani : అహంకారమే కేశినేనికి దెబ్బ..
ఆయన తనని తాను చాలా గొప్పవాడినని అనుకుంటాడు. పార్టీతో పని లేకుండా ఎదిగిపోయానని భావిస్తాడు. పార్టీ జెండా, అధినేత బొమ్మ అవసరం లేకుండా సొంత ఇమేజ్ తో గెలిచాను అనుకుంటాడు. అక్కడితో ఆగడు.. ఎవ్వడినైనా పూచిక పుల్లలా తీసి పడేస్తాడు. వాడెంత? వీడెంత..? అని గప్పాలు కొడుతూ ఉంటాడు. ఈయన ఎవరో అర్థమయ్యే ఉంటుంది.. కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని... విజయవాడ ఎంపీ. తెలుగుదేశంతో నాని అనుబంధం అంతా కలిసి పదేళ్లు మాత్రమే.
ఆయన తనని తాను చాలా గొప్పవాడినని అనుకుంటాడు. పార్టీతో పని లేకుండా ఎదిగిపోయానని భావిస్తాడు. పార్టీ జెండా, అధినేత బొమ్మ అవసరం లేకుండా సొంత ఇమేజ్ తో గెలిచాను అనుకుంటాడు. అక్కడితో ఆగడు.. ఎవ్వడినైనా పూచిక పుల్లలా తీసి పడేస్తాడు. వాడెంత? వీడెంత..? అని గప్పాలు కొడుతూ ఉంటాడు. ఈయన ఎవరో అర్థమయ్యే ఉంటుంది.. కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని… విజయవాడ ఎంపీ. తెలుగుదేశంతో నాని అనుబంధం అంతా కలిసి పదేళ్లు మాత్రమే. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేశారు కేశినేని నాని. అప్పటికే కేశినేని ట్రావెల్స్ తో పాపులర్ అయిన నాని.. ఆ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేయడం.. రాష్ట్రం విడిపోవడం.. ఆ పరిణామాలన్నీ కేశినేని నానికి కలిసొచ్చాయి. 2014లో నాని తెలుగుదేశం తరఫున బెజవాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కమ్మ సామాజిక వర్గం కావడంతో పార్టీలో త్వరగానే అల్లుకుపోగలిగారు. అంతేకాదు ఢిల్లీలోనూ కాస్త సంబంధాలు మెరుగయ్యాయి. కేంద్రమంత్రి గడ్కరీ లాంటి వాళ్లకు కాస్త దగ్గర అయ్యారు.
ఢిల్లీ స్థాయికి ఎదిగినా.. బెజవాడ ఆటోనగర్ స్టైల్ పోలేదు. అహంకారం, దుడుకు స్వభావం, ఎవరినైనా ఎంతమాటైనా అనేయడం ఈ లక్షణాలన్నీ ఢిల్లీలో నానిని ఒంటరి వాడిని చేశాయి. 2019లో టిడిపి మూడే ఎంపీలు గెలవగా.. అందులో కేసినేని ఒకరు కావడంతో ఇక ఆయన అహంకారానికి అడ్డూ అదుపు లేకపోయింది. పార్టీ స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలను తరచూ కించపరుస్తూ మాట్లాడే నాని ఒకానొక స్థాయిలో అధినేత చంద్రబాబుపైనా సెటైర్లు వేయడం మామూలు అయిపోయింది. బెజవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జిలతో సహజంగానే కేశినేని నానికి దూరం పెరిగింది. తన కుమార్తెకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని హంగామా చేసి, ఆ తర్వాత ఆమెను కార్పొరేటర్ గా పోటీ చేయించారు. ఆ తర్వాత మళ్లీ ఆమెకు మేయర్ పదవి కోసం అధిష్టానంతో గొడవకు దిగారు. ఆ సమయంలోనే కేశినేనికి చంద్రబాబుకు మధ్య మరింత దూరం పెరిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో చంద్రబాబు వచ్చినప్పుడు బొకే ఇచ్చే విషయంలో కేశినేని నాని దురుసు ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరిచింది.
కేశినేని నాని విజయాలన్నీటికీ తెర వెనుక ఉండి కృషి చేసే కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నిపై లోకేష్ దృష్టి పడింది. 15 ఏళ్లుగా తెరవెనక పాత్ర పోషిస్తున్న చిన్నిని తెలుగుదేశం అధిష్టానం తెరపైకి తెచ్చింది. ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో నాని కంటే చిన్నికి పట్టు ఎక్కువ. అంతేకాదు స్థానిక నాయకులందరితోనూ సమన్వయం చేసుకోవడంలో చిన్ని బాగా అల్లుకుపోగలుగుతాడు. రెండేళ్ల క్రితం వరకు తెరవెనక రాజకీయాలకు, వ్యాపారానికి కేశినేని శివనాథ్ పరిమితం అయ్యారు. చిన్ని యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాగానే ఇక నాని నోరుకి అంతూ పొంతు లేకుండా పోయింది. కేశినేని చిన్నితో పాటు ఆయనకు మద్దతుగా నిలిచిన బుద్ధ వెంకన్న, దేవినేని ఉమా, జలీల్ ఖాన్, నాగుల్ మీరా, బేగ్, బోండా ఉమా, శ్రీరామ తాతయ్య వీళ్ళందర్నీ కేశినేని నాని నిత్యం తిట్టు పోయడం మొదలుపెట్టారు. నాని వ్యవహారంతో బెజవాడ ఎంపీ పరిధిలో ఉన్న జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ నాయకులంతా విసిగిపోయారు. క్రమంగా వీళ్లంతా చిన్ని వైపు టర్న్ అయ్యారు. నాని ఎంత దురుసుగా మాట్లాడినా.. ఎన్ని మాటలన్నా.. కేశినేని చిన్ని నోరు జారకపోవడం, సంయమనంతో వ్యవహరించడం ఆయనకు కలిసొచ్చింది. దీనికి తోడు చిన్ని స్వయంగా అన్న క్యాంటీన్ ని సొంతంగా నడపడం, మెడికల్ క్యాంపులు నిర్వహించడ.. టీడీపీ కార్యకర్తలతో కలిసి మెలిసి వ్యవహరిచారు. కృష్ణాజిల్లాలో లోకేష్ పాదయాత్రను దగ్గరుండి నడిపించడంతో.. కేశినేని చిన్నిని ఎంపీ కాండేట్ గా ప్రకటించాలని చంద్రబాబు గట్టి నిర్ణయానికి వచ్చేసారు. అప్పుడు వరకు కేశినేని నాని ఎన్ని అవాకులు. చవాకులు పేలినా.. నోరెత్తని బాబు తెలివిగా తిరువూరు సభను కేశినేని నానిని సాగనంపడానికి వాడుకున్నారు.
తిరువూరు సభ నిర్వహణ బాధ్యతను చిన్నికి అప్పజెప్పడం ద్వారా ఆయన్నే బెజవాడ ఎంపీ కాండిడేట్ అని, నానినీ పక్కన పెడుతున్నామనే విషయాన్ని పరోక్షంగా చెప్పేశారు. దీంతో అసహనాన్ని గురైన నాని… పార్టీకి, పదవికి రాజీనామా ప్రకటించేశారు. ఆయన కుమార్తె శ్వేతతో కూడా రిజైన్ చేయించారు. తన సత్తా ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. కానీ నిజానికి నాని నోటి దురుసు అహంకారానికి…. జనం, పార్టీ కార్యకర్తలు ఎప్పుడో దూరం అయ్యారు. నాని ఇంకా తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఆయన ఎన్నికల్లో గెలవలేడని విషయాన్ని వైసిపి
కూడా గుర్తించింది. అందుకే నానిని దగ్గరకు తీయకూడదని నిర్ణయించింది. టిడిపి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం, మరోవైపు కేశినేని నాని బరిలోంచి పూర్తిగా తప్పుకోవడంతో… చిన్ని ఎన్నికల పని మొదలుపెట్టేసారు. ఎమ్మెల్యే అభ్యర్థులందరితో సమన్వయం, జనంతో సంబంధాలు.. చిన్నికి అడ్వాంటేజ్ అవుతున్నాయి. కేశినేని నానికి తన బలం ఏంటో తెలుసు. అయినప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అధికారాంతమున చూడవలె.. అయ్య వారి వైభవము అన్నట్లు.. ఇప్పుడు చూడాలి కేశినేని నాని వారి పనితనం.