REV PARTY , TDP vs YCP : రేవ్ పార్టీపై టీడీపీ, వైసీపీ వార్ షాకింగ్ ఫోటోలు రిలీజ్
బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వర్సెస్ టీడీపీ (YCP Vs TDP) వివాదంగా మారింది. ఈ రేవ్ పార్టీతో మీకు సంబంధం ఉందంటే... మీకు ఉందంటూ... రెండు పార్టీలు సోషల్ మీడియాల్లో షాకింగ్ ఫోటోలను షేర్ చేస్తున్నాయి.

TDP, YCP War Shocking Photos Released on Rave Party
బెంగళూరు రేవ్ పార్టీ (Bangalore Rave Party) వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వర్సెస్ టీడీపీ (YCP Vs TDP) వివాదంగా మారింది. ఈ రేవ్ పార్టీతో మీకు సంబంధం ఉందంటే… మీకు ఉందంటూ… రెండు పార్టీలు సోషల్ మీడియాల్లో షాకింగ్ ఫోటోలను షేర్ చేస్తున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ సప్లయ్ సూత్రధారులు మీరంటే మీరని వైసీపీ, టీడీపీ నేతలు ఆరోపించుకుంటున్నారు. బెంగళూరు పోలీసులు దాడి చేసిన రోజున… వైసీపీ (YCP) మంత్రి కానాణి గోవర్థన్ రెడ్డి (Kanani Goverthan) కి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ కారు అక్కడ పట్టుబడింది. దాంతో ఈ కేసులో వైసీపీ లీడర్లకు ప్రమేయం ఉందని టీడీపీ ఆరోపించింది.
కాకాణి మాత్రం తన కారు స్టిక్కర్ ఎందుకుందో తెలియదనీ… ఎంక్వైరీ చేయాలని పోలీసులకు కంప్లయింట్ కూడా ఇచ్చానంటున్నారు. టీడీపీ (TDP) సోషల్ మీడియా మాత్రం రేవ్ పార్టీకి డ్రగ్స్ సప్లయ్ చేసింది వైసీపీయే అంటూ ఆరోపణలు చేస్తోంది. అటు వైసీపీ సోషల్ మీడియా కూడా అంతే ధీటుగా కౌంటర్ ఇస్తోంది. ఈ పార్టీలో డ్రగ్స్ సప్లయ్ చేసి పట్టుబడ్డ వాళ్ళల్లో ప్రణీత్ చౌదరి, సుకుమార్ నాయుడు… ఈ ఇద్దరూ బెంగళూరు జై టీడీపీ ఐటీ ఫోరంకి చెందిన కీలక వ్యక్తులని అంటోంది. పూతలపట్టు టీడీపీ అభ్యర్థి మురళితో వీళ్ళకి సంబంధాలు ఉన్నారనీ… వీళ్ళంతా నారా లోకేష్ అనుచరులు అంటూ ట్వీట్స్ చేస్తోంది.
దీనికి కౌంటర్ గా టీడీపీ… తమ మెస్సేజ్ ను కరెక్ట్ చేశామంటూ మరో పోస్ట్ పెట్టింది. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ సప్లయ్ దారులు సైకో జగన్ (CM Jagan) అనుచరులు, వైసీపీ నేతలు అని ఆరోపించింది. జగన్, కాకాణి గోవర్థన్ రెడ్డితో ఉన్న ఫోటోలు, నటి హేమతో దిగిన ఫోటోలను పెడుతూ వైసీపీని టార్గెట్ చేసింది టీడీపీ. నిజంగా ఈ రెండు పార్టీలతో ఏ సంబంధాలు ఉన్నాయో… ఏమో గానీ… అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కి ముందు ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ మాత్రం ఓ రేంజ్ లో నడుస్తోంది.