YS Jagan : మాజీ సీఎంకు తెలంగాణ ప్రభుత్వం షాక్.. లోటస్ పాండ్ జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ ప్రభుత్వం బీగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.

Telangana govt shocks former CM. Lotus pond demolished at Jagan's house
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ ప్రభుత్వం బీగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.
జగన్ నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను GHMC అధికారులు తొలగించారు. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఫిర్యాదులు అందాయి. ఫుట్‍పాత్ ఆక్రమించి జగన్ ఇంటి ముందు నాలుగు గదుల సెక్యూరిటీ పోస్ట్‌ల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల సాయంతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చేశారు. జేసీబీలతో సెక్యూరిటీ పోస్టులను తొలగించారు. ఏపీ మాజీ సీఎం కావడంతో లోటస్ పాండ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాగా జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు జరుగుతున్న సమయంలో అక్కడికి వైసీపీ పార్టీ శ్రేణులు గానీ.. జగన్ అభిమానులు రాకపోవడంతో కూల్చివేతలు ప్రశాంతంగా జరిగాయి.