Chandrababu : సీఎంగా చంద్రబాబు రెండో సంతకం ఆ ఫైల్ మీదే
ఏపీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బ కొట్టిన అంశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. ప్రచారం చివరలో ఈ విషయం తెరమీదకు వచ్చినా.. లాస్ట్ మూమెంట్‌లో వైసీపీకి ఇది పెద్ద దెబ్బగా మారింది.
ఏపీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బ కొట్టిన అంశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి. ప్రచారం చివరలో ఈ విషయం తెరమీదకు వచ్చినా.. లాస్ట్ మూమెంట్‌లో వైసీపీకి ఇది పెద్ద దెబ్బగా మారింది. ప్రచారం కూడా పక్కన పెట్టి వైసీపీ పెద్దలు ఈ విషయంలో ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో చంద్రబాబు దీన్నే ఆయుధంగా మార్చుకున్నారు.
తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీదే పెడతానంటూ హామీ ఇచ్చారు. అన్నట్టుగానే టీడీపీ కూటమి ఎన్నికల్లో భారీ విజయం సాధించింది. మరికాసేపట్లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఏపీని మొదటి నుంచి పట్టి పీడిస్తున్న సమస్యలో నిరుద్యగ సమస్య అతిపెద్దది. ఈ కారణంగానే తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ మీదే మొదటి సంతకం పెడగానంటూ చంద్రబాబు చెప్పారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడగానంటూ చెప్పారు.
ఇప్పుడు చెప్పినట్టుగానే ఆ రెండు సంతకాలు చేసేందుకు రెడీ అయ్యారు చంద్రబాబు. ఇవాళ ఉదయం 11 గంటల 25 నిమిషాలకు చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం హోదాలో ఆయన మెగా డీఎస్సీ మీద మొదటి సంతకం చేయబోతున్నారు. దాని తరువాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రెండో సంతకం చేయబోతున్నారు.