YS Jagan : ఆ విషయంలో జగన్‌ను బీట్ చేయలేకపోయిన కూటమి..
ఏపీ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేశాయ. జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూడా ఫలితాలను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యింది.
ఏపీ ఎన్నికల ఫలితాలు అందరి అంచనాలను తలకిందులు చేశాయ. జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూడా ఫలితాలను అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యింది. పోటాపోటీ ఉంటుంది అనుకుంటే ల్యాండ్‌స్లైడింగ్ విక్టరీతో కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. దీంతో ఇక వైసీపీ భూస్థాపితం కావాల్సిందేనా అనే అనుమానాలు మొదలయ్యాయి. మరి నిజంగా వైసీపీ భూ స్థాపితం కావాల్సిందేనా అంటే లేదనే అంటున్నారు చాలా మంది విశ్లేషకులు. ఎన్నికల్లో ఓడిపోయినా.. 11 సీట్లకే పార్టీ పరిమితమైనా.. భారీ స్థాయిలో వైసీపీ ఓట్‌బ్యాంక్ సాధించింది.
గత ఎన్నికల్లో వైసీపీకి 39.37 శాతం ఓట్ షేర్ వచ్చింది. ఇక వైసీపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన కూటమి ఓవరాల్‌గా 52.24 ఓట్ షేర్ సాధించింది. ఇందులో టీడీపికి 45.60 శాతం ఓట్‌షేర్ లభించింది. అలయన్స్‌లో భాగస్వామిగా ఉన్న బీజేపీ 2.82 ఓట్ షేర్ సాధించింది. ఇక జనసేన పార్టీ దాదాపు 7 శాతం ఓట్‌షేర్ సాధించింది. పార్టీ నిలబడటానికి గెలిచిన నాయకులే కాదు పార్టీకి ఓటు వేసిన కార్యకర్తలు కూడా కీ రోల్ ప్లే చేస్తారు. ఆ లెక్కన చూస్తే వైసీపీ మరీ దీన స్థాయికి పడిపోలేదు అంటున్నారు విశ్లేషకులు.
ఇక ఏపీలో ప్రభుత్వం వ్యతిరేక ఓట్‌బ్యాంక్ చీలిపోకుండా పక్కా వ్యూహంతో వెళ్లారు పవన్ కళ్యాణ్. సక్సెస్ కూడా అయ్యారు. అందుకే ఒక్క ఓట్ కూడా మిస్ అవ్వలేదు. వైసీపీ ఒంటరిగా పోటీ చేసినా.. మిగిలిన పార్టీలు కూటమిగా పోటీ చేసినా ఓట్‌షేరింగ్ వాల్యూ దాదాపు 11 శాతం కనిపించింది. నిజానికి ఈ కూటమి లేకపోయి ఉంటే ఓట్లు భారీ స్థాయిలో చీలిపోయేవి. అది ఖచ్చితంగా వైసీపీకే లాభంగా మారి ఉండేది. ఈ లెక్కన కూటమి ఎన్నికలు గెలిస్తే వైసీపీ మనసులు గెలిచింది అనేది క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ స్థాయిలో ఓట్‌బ్యాంక్ ఉన్న పార్టీ భూస్థాపితం అవ్వడం అంత ఈజీ కాదు అనేది చాలా మంది విశ్లేషకులు చెప్తున్న మాట.