AP elections CM Jagan : జగన్ చేసిన ఎనిమిదో తప్పు.. ఏపీలో ఏ మాత్రం కనిపించని అభివృద్ధి!
ఐదేళ్లలో విజిబుల్ అభివృద్ధి.. ఏపీ (AP) లో కనిపించలేదు. డబ్బులు మొత్తం సంక్షేమ పథకాలకే పెట్టడంతో.. ఖజానాలో రూపాయి మిగలడం లేదు. కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. యూనివర్సిటీలు, ఇతర సంస్థలు దగ్గరున్న నిధుల్ని కూడా డైవర్ట్ చేసి గవర్నమెంట్ వాడేసుకుంది. కొత్తగా విద్యాసంస్థలు పెట్టినట్టుగా కానీ.. పరిశ్రమలు పెట్టినట్టుగా కానీ.. ఎక్కడ కనిపించదు.

The eighth mistake made by Jagan.. There is no visible development in AP!
ఐదేళ్లలో విజిబుల్ అభివృద్ధి.. ఏపీ (AP) లో కనిపించలేదు. డబ్బులు మొత్తం సంక్షేమ పథకాలకే పెట్టడంతో.. ఖజానాలో రూపాయి మిగలడం లేదు. కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. యూనివర్సిటీలు, ఇతర సంస్థలు దగ్గరున్న నిధుల్ని కూడా డైవర్ట్ చేసి గవర్నమెంట్ వాడేసుకుంది. కొత్తగా విద్యాసంస్థలు పెట్టినట్టుగా కానీ.. పరిశ్రమలు పెట్టినట్టుగా కానీ.. ఎక్కడ కనిపించదు. రామాయంపేట పోర్టు, అధాని డేటా సెంటర్‌తో పాటు మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నా.. ఏ రకంగానూ దోహదపడలేదు. కేంద్రంలో బీజేపీ సన్నిహిత సంబంధాలు ఉన్నా.. సంక్షేమ పథకాలకు డబ్బులు తెచ్చుకున్నారు తప్ప… అభివృద్ధి కోసం డబ్బులు తీసుకురాలేకపోయింది జగన్ సర్కార్(Jagan Sarkar). అంతే కాదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయింది. అదానీకి అడ్డగోలుగా ప్రాజెక్టులు కట్టబెట్టింది. రోడ్లు లేవు, వంతెనలు లేవు, పరిశ్రమలు లేవు, విద్యాసంస్థలు లేవు. దీంతో ఏపీలో అభివృద్ధి జరగలేదనేది జనంలోకి బాగా వెళ్లిపోయింది. అంతేకాదు బీజేపీ (BJP) తో రహస్య స్నేహం కూడా వైసీపీ (YCP) కి చేటు చేసింది.