AP elections CM Jagan : జగన్ చేసిన ఐదో తప్పు… రాష్ట్రంలో ఇసుక కొరత.. అల్లాడిన జనం..
లిక్కర్ తర్వాత జగన్ సమకూర్చుకున్న ఆదాయ వనరు ఇసుక. రాష్ట్రంలోని ఇసుకను ప్రైవేట్ సంస్థకు లీజ్‌కు ఇచ్చేశాడు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గానీ.. నాయకులు ఎవరు అటువైపు చూడకూడదని ఆదేశించారు.
లిక్కర్ తర్వాత జగన్ సమకూర్చుకున్న ఆదాయ వనరు ఇసుక. రాష్ట్రంలోని ఇసుకను ప్రైవేట్ సంస్థకు లీజ్‌కు ఇచ్చేశాడు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గానీ.. నాయకులు ఎవరు అటువైపు చూడకూడదని ఆదేశించారు. ఆ ప్రైవేట్ సంస్థ ఇసుక తవ్వుకుంటది… దానికి ఎంత చెల్లించాలో అంత ప్రభుత్వానికి చెల్లిస్తుంది. దీంతో రాష్ట్రంలో ఇసుక కరువు వచ్చేసింది. ఇసుక రేటును ప్రైవేట్ సంస్థ రేటు నిర్ణయించింది. చాలా నిర్మాణాలు ఇసుక లేక నిలిచిపోయాయి. చివరికి అధిక రేటు ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇసుక కారణంగా జగన్ ఆర్థికంగా బలపడి వచ్చేమో కానీ… సామాన్యులు మాత్రం ఇసుక దెబ్బతో విలవిల్లాడిపోయారు. జగన్ చేసిన మరో తప్పిదం… మొత్తం ఇసుక అమ్ముకోవడం.