AP Elections Red Book : రెడ్‌ బుక్‌ ఓవరాక్షన్‌తో మొదటికే మోసం.. జగన్‌కు గేట్లు తెరిచిన లోకేశ్‌..

రెడ్‌బుక్‌.. ఏపీ ఎన్నికల ముందు పదేపదే వినిపించిన మాట ఇదే. ఎన్నికలు జరిగాయ్. వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడింది. ఇలాంటి ఓటమితో ఎవరైనా సరే.. ఇంటి నుంచి అంత ఈజీగా అడుగుపెట్టరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 27, 2024 | 12:35 PMLast Updated on: Jul 27, 2024 | 12:35 PM

The First Fraud With The Red Book Operation Lokesh Opened The Gates For Jagan

 

 

రెడ్‌బుక్‌.. ఏపీ ఎన్నికల ముందు పదేపదే వినిపించిన మాట ఇదే. ఎన్నికలు జరిగాయ్. వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడింది. ఇలాంటి ఓటమితో ఎవరైనా సరే.. ఇంటి నుంచి అంత ఈజీగా అడుగుపెట్టరు. అలాంటిది జగన్ మాత్రం. 50రోజులకే జనాల్లోకి వచ్చేశాడు.. ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారు. దీనికి కారణం.. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు. వీటిని అడ్డుపెట్టుకొని జగన్ ఢిల్లీ వరకు వెళ్లారు. నేషనల్‌ మీడియాలో హాట్‌టాపిక్ అయ్యారు. ఈ పరిస్థితి కారణం.. లోకేశ్‌ రెడ్‌ బుక్ ఓవరాక్షనేనా.. జగన్‌కు ఒకరకంగా గేట్లు తెరిచింది లోకేశేనా.. ఏం జరిగింది.. ఏం జరుగుతోంది.. వాచ్‌ దిస్..

ఏపీ రాజకీయం రకరకాల మలుపులు తీసుకుంటోంది. నిజానికి ఈ ఎన్నికల్లో తగిలిన దెబ్బకి.. వైసీపీకి, జగన్‌కు కోలుకోవడానికి చాలా సమయం పట్టాలి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూస్తే.. తక్కువలో తక్కువ కనీసం ఆరు నెలలైనా.. జగన్ ఇంటి గడప దాటలేకుండా ఉండాల్సిన పరిస్థితి. 2019లో 151 సీట్లతో అధికారం దక్కించుకున్న వైసీపీ.. 2024కు వచ్చేసరికి 11 సీట్లకు పరిమితం అయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అసలు ఇలాంటి ఫలితాలు ఎలా వచ్చాయో.. జనం ఎందుకు ఇంతలా వన్‌సైడెడ్‌గా మారిపోయారో.. ఇప్పటికీ ఈ ఫలితాలు ఏంటో జగన్‌కు, వైసీపీకి జీర్ణం కావడం లేదు. జనాలు కేవలం 11 సీట్లకే పరిమితం చేయడంతో.. కనీసం ఆరు నెలలయినా జగన్.. జనాల్లో కనిపించరు అనుకున్నారు అంతా ! సీన్‌ మాత్రం రివర్స్ అయింది. జగన్ ఒక్కసారిగా దూసుకువచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 50రోజులకే జనాల్లోకి వచ్చేశారు. ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టారు. కూటమి సర్కార్‌ తీరు ఇదీ.. లోకేశ్‌ మిగిల్చిన భయాలు ఇవీ.. చంద్రబాబు కేరక్టర్ ఇదీ అంటూ… ధర్నాలు, దీక్షలు చేస్తున్నారు. సైలెంట్‌గా ఉంటారు అనుకున్న జగన్.. ఈ స్థాయిలో దూసుకు రావడానికి ఒకే ఒక్క కారణం.. ఏపీలో జరిగిన అల్లర్లు, హత్యలు. ఎన్నికల తర్వాత నుంచే ఏపీలో విధ్వంసకర పరిస్థితులు కనిపించాయ్. మాచర్ల అయితే రగిలిపోయింది ఒకరకంగా ! కేసులు, అరెస్టులు.. రోజూ ఇదే కనిపిస్తోంది ఏపీలో ! పిన్నెల్లి అరెస్ట్ ఘటన ఓ వైపు.. మాజీ మంత్రులపై కేసులు మరోవైపు..

ఇలా వైసీపీని టార్గెట్‌ చేస్తూ కనిపిస్తున్న రాజకీయాలను.. జగన్‌ పక్కాగా అదిమి పట్టుకున్నారు అనిపిస్తుంది. ఓదార్పు అన్నా.. ఓదార్చే పరిస్థితులు అన్నా.. జగన్ ఇట్టే రియాక్ట్ అయిపోతుంటారు. తండ్రి మరణాన్ని అడ్డుపెట్టుకొని.. ఓదార్పు యాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లిన జగన్.. ఒక బ్రాండ్ క్రియేట్‌ చేశారు. కాంగ్రెస్‌ను అంతా తన వైపు లాక్కొని.. వైసీపీని బలంగా మార్చారు. అలాంటి జగన్.. ఇప్పుడు టీడీపీ ఇస్తున్న అవకాశాలను వదులుకుంటారా.. చాన్సే లేదు. టీడీపీ ఇస్తున్న ప్రతీ అవకాశాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నారు. అదే టీడీపీ మీద ఎక్కుపెడుతున్నారు. ఏపీలో అల్లర్లను, హత్యలను అడ్డుపెట్టుకొని ఢిల్లీ వరకు వెళ్లారు జగన్. ఆయనకు ఈ చాన్స్‌ ఇచ్చింది. ఇలాంటి అవకాశం కల్పించింది.. ఆ అవకాశాలకు జగన్‌కు గేట్లు తెరిచింది ఒక రకంగా లోకేశే ! ఎన్నికల ముందు లోకేశ్‌ మాటలనే.. ఇప్పుడు ఆయుధంగా మార్చుకున్నారు. సింపథీ వర్కౌట్ చేయడంతో పాటు.. దేశవ్యాప్తంగా అటెన్షన్ డ్రా చేస్తున్నారు జగన్‌. ఎన్నికల ముందు రెడ్‌బుక్ అంటూ లోకేశ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ప్రతీ ఒక్కటి రెడ్‌బుక్‌లో రాస్తున్నానని.. అధికారం వచ్చాక ఎవరినీ వదిలేది లేదు అంటూ లోకేశ్‌ చేసిన కామెంట్స్‌.. ఇప్పుడు జగన్‌కు ఆయుధంగా మారాయ్. లోకేశ్‌ కామెంట్స్‌కు తగినట్లే అన్నట్లు.. ఏపీలో పరిస్థితులు మారాయ్. అల్లర్లు, హత్యలు.. ఇవన్నీ కక్షసాధింపే అని.. రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని.. లోకేశ్‌ రెడ్‌బుక్‌ అరాచకాలు అంటూ జగన్‌ జనాల్లోకి వెళ్లడం స్టార్ట్ చేశారు. లోకేశ్ రెడ్‌బుక్‌ మాటలను హైలైట్‌.. సింపథీ గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు కూడా ఇదే సీన్ కనిపించింది. ఎన్నికల ముందు రెడ్‌ బుక్‌ చూపిస్తూ అందర్నీ బెదిరించిన లోకేష్.. ఇప్పుడు ప్రభుత్వంలో భాగమై ఉన్నారని.. లోకేష్ చెప్పినట్టుగానే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతీకార దాడులు జరుగుతున్నాయని.. నేషనల్‌ మీడియా కూడా గుర్తుంచుకునేలా డైలాగ్‌లు వదిలారు జగన్. రెడ్‌బుక్‌ పేరుతో హోర్డింగ్స్‌ పెట్టి మరీ జనాలను బెదిరిస్తున్నారని.. జాతీయ పార్టీలకు, జాతీయ మీడియాదృష్టికి ఏపీ పరిస్థితిని తీసుకెళ్లగలిగాడు. తీసుకెళ్లగలిగారు జగన్‌.

ఇంతే కాదు.. 11సీట్లకు పరిమితం అయి.. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదా దక్కించుకోలేని పరిస్థితుల్లో అమాయకంగా దిక్కులు చూస్తున్న జగన్‌కు.. ఒకరకంగా దారి చూపించింది కూడా లోకేశ్ రెడ్‌బుక్కే! ఒంటరి అయింది అనుకున్న వైసీపీకి.. ఇండియా కూటమిని దగ్గర చేసింది కూడా ఇదే రెడ్‌బుక్‌. రాష్ట్రంలో అల్లర్లపై ఢిల్లీలో ధర్నా చేసిన జగన్‌కు.. ఇండియా కూటమిలోని మెజారిటీ పార్టీలు మద్దతు తెలిపాయ్. ఒకరకంగా జగన్‌ను దగ్గర చేసుకున్నాయ్. జగన్‌ కూడా ఇండియా కూటమికి దగ్గరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఇది కూడా లోకేశ్‌ మొదలుపెట్టిన రెడ్‌బుక్‌ పుణ్యమే! ఇలా లోకేశ్‌ చేసిన ఓవరాక్షన్‌ ఇప్పుడు జగన్‌ను మళ్లీ జనాల్లోకి తీసుకువచ్చింది. జనాలకు దగ్గర చేస్తోంది. ఒక రకంగా అన్ని దారులు మూసుకుపోయిన సమయంలో.. వైసీపీకి గేట్లు తెరిచింది.. దారులు చూపించింది కూడా.. లోకేశ్‌ రెడ్‌బుక్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.