FAKE JOBS : పేటీఎం బ్యాచ్ కీ సర్కారీ జీతాలే.. ప్రజల సొమ్ము మెక్కేశారు కదరా…
2019లో వైసీపీ సర్కార్ రాగానే... గవర్నమెంట్ ఆఫీసుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అంతకుముందు టీడీపీ హయాంలో పనిచేసిన వాళ్ళందర్నీ పీకేశారు. ఆ తర్వాత దందా మొదలైంది.

The first scam was exposed in Jagan's government. CM Chandrababu ordered an inquiry into the contract staff scam in government offices.
జగన్ ప్రభుత్వంలో ఫస్ట్ స్కామ్ బయటపడింది. ప్రభుత్వ ఆఫీసుల్లో కాంట్రాక్ట్ స్టాఫ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబు ఎంక్వైరీకి ఆదేశించారు. ఐదేళ్ళల్లో ఏ ఒక్కనాడూ ఆఫీసుకు రాకుండా… వైసీపీ కార్యాలయాల్లో పనిచేసుకుంటూ గవర్నమెంట్ శాలరీలు తీసుకున్న వేల మంది బండారం బయటపెట్టబోతోంది.
2019లో వైసీపీ సర్కార్ రాగానే… గవర్నమెంట్ ఆఫీసుల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అంతకుముందు టీడీపీ హయాంలో పనిచేసిన వాళ్ళందర్నీ పీకేశారు. ఆ తర్వాత దందా మొదలైంది. వైసీపీ కార్యకర్తలు, లీడర్లు రికమండ్ చేసిన వాళ్ళకీ ఉద్యోగాలివ్వడం మొదలైంది. ప్రభుత్వంలో ఓ ఉద్యోగిని కాంట్రాక్ట్ గా పెట్టుకున్నా సరే… ఎగ్జామ్ పెట్టాలి… రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలి. ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి. కానీ ఇవేమీ పట్టలేదు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు… శాఖల వారీగా ప్రభుత్వ ఆఫీసుల్ని పంచేసుకున్నారు. సిఫార్సులు, పైరవీలు, పైసలతోనే ఉద్యోగాలు ఇచ్చిపడేశారు. ఎంత దారుణం అంటే… తెల్లారి లేస్తే… వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తూ… చంద్రబాబు, పవన్ కల్యాణ్ ని బండ బూతులు తిట్టే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. జీతమేమో ప్రభుత్వం దగ్గర… పనిచేసేదేమో పార్టీ ఆఫీసుల్లో. వాళ్ళే కాదు… ఆ కాంట్రాక్ట్ ఉద్యోగుల భార్య, భర్త, కుటుంబ సభ్యులు కూడా సర్కారీ నౌకరు పేరుతో ప్రజల సొమ్మును పందికొక్కుల్లా మెక్కేశారు.
వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు… అంటే నెటిజెన్ల భాషలో చెప్పాలంటే… వైసీపీ పేటీఎం బ్యాచ్… వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చారట. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అయితే ఇలాంటి బ్యాచ్ వందల మంది ఉన్నారు. వీళ్ళంతా ఒకే సామాజికి వర్గానికి చెందిన వాళ్ళు కూడా. స్కిల్ డెవలప్ మెంట్ తో పాటు, APDC, ఈ-ప్రగతి, RTGS, స్పందన కాల్ సెంటర్లలో ఎక్కువగా వైసీపీ బ్యాచ్ కి ఉద్యోగాలిచ్చారు. మైనింగ్ శాఖలో అయితే… వందల మందిని రిక్రూట్ చేయడంతో… వాళ్ళకి కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండేవి కావు. ఆఫీసుకు వచ్చేవాళ్ళే తక్కువ అయితే… ఆ వచ్చినోళ్ళకి కూడా పనీ లేకపోవడంతో… మొబైల్స్ చూసుకుంటూ కాలక్షేపం చేసి వెళ్ళిపోయేవారు. ఇంటర్ చదివిన వాళ్ళకే మేనేజర్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టులు కట్టబెట్టారంటే… వైసీపీ హయాంలో ఫేక్ జాబ్స్ స్కామ్ ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది. ఉద్యోగాలే కాదు… వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసేవారు, పేటీఎం బ్యాచ్, వారి కుటుంబ సభ్యులు, యూట్యూబర్లు, మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకి ఉద్యోగాలతో సంబంధం లేకుండా… కొన్ని ప్రభుత్వ శాఖల నుంచి డైరెక్ట్ గా డబ్బులు చెల్లించినట్టు బయటపడింది.
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే… వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్, లోకేశ్ లాంటి అపోజిషన్ లీడర్లను వ్యక్తిగతంగా ఎంత ఎక్కువ డ్యామేజీ చేస్తే… ఎంత ఎక్కువగా తిడుతూ యాక్టివ్ గా పనిచేస్తే వాళ్ళకి వెంటనే ఇంక్రిమెంట్స్ కూడా ఇచ్చేవారని చెబుతున్నారు. జగన్ హయాంలో జరిగిన ఈ ఫేక్ జాబ్స్ స్కామ్ పై చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి పెట్టింది. ఆ నకిలీ ఉద్యోగులు ఎవరు… వాళ్ళని ఎవరు సిఫార్సు చేశార. ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు కనిపెట్టే పనిలో ఉన్నారు అధికారులు. వీళ్ళందరిపైనా కేసులు పెట్టడంతో పాటు… అప్పనంగా మెక్కిన ప్రజల సొమ్మును రికవరీ చేయాలని కూడా కొత్త ప్రభుత్వం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.