AP Education Board : నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్…
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి నేడు ఉన్నత విద్యామండలి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి నేడు ఉన్నత విద్యామండలి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.20 లక్షల వరకు డిగ్రీ సీట్లుండగా.. ఈ సీట్లను ఆన్‌లైన్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈసారి బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ వంటి కోర్సులు అఖిల భారత విద్యామండలి (ఏఐసీటీఈ) పరిధిలోకి వెళ్లాయి. 10వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. 5 నుంచి ధ్రువపత్రాల పరిశీలన, 11-15 వరకు ఆప్షన్ల ఎంపిక చేసుకోవచ్చు. 19న సీట్లు కేటాయిస్తారు. 20-22 తేదీల్లోగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు VIJలోని SRR, విశాఖలోని VS కృష్ణ, TPTలోని SV వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా డిగ్రీ ప్రవేశాలు చేస్తారు. రాష్ట్రంలో డిగ్రీ ఆన్‌లైన్ కౌన్సిలింగ్ జూన్ 18 నుంచి 29 వరకు నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. కాగా కాలేజీలు ఏఐసీటీత నుంచి పర్మిషన్లు పొందే ప్రక్రియ ఆలస్యం కావడంతో ఈ ఏడాది అడ్మిషన్ల ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది.