IMD Heavy rains : రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 2, 2024 | 06:00 PMLast Updated on: Jun 02, 2024 | 6:00 PM

The Meteorological Center Of Hyderabad Has Announced That There Will Be Rains In Telangana State For Five Days

తెలంగాణ రాష్ట్రంలో అక్కడకక్కడా ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు 40-50Kmph వేగంతో ఈదురుగాలులు వీస్తాయంది. మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు వీస్తాయని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి.

APని తాకిన రుతుపవనాలు..

నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించాయి. సీమలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. తొలుత ఈ నెల 4-5 తేదీల్లో రుతుపవనాలు ఏపీని తాకుతాయని భావించగా.. ముందుగానే ప్రవేశించాయి.

నగరంలో భారీ వర్షం..

కాగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.. ఆసిఫాబాద్, మందమర్రి, ధర్మపురి, కమలాపూర్, కరీంనగర్, చెన్నూరు, పెద్దపల్లి, సిర్పూర్, కాగజ్నగర్, షాద్ నగర్, మోత్కూరు, వలిగొండ, భువనగిరి సహా హైదరాబాద్లోని ఉప్పల్, రామంతాపూర్, చిలుకానగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లిలో భారీ వర్షం పడుతోంది.