VIZAG MURDER : ప్రాణం తీసిన పెండింగ్ ఫైల్.. MRO హత్యకు అసలు కారణం
ఏపీలోని (AP Politics) విశాఖలో (Visakha MRO) తహశీల్దార్ రమణయ్య (Ramaṇayya) హత్య (Murder) వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయ్. రుషికొండలోని అత్యంత ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ వ్యవహారం తిరుగుతోంది. ఈ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్లకు అవసరమైన రెవెన్యూ క్లియరెన్స్ పెండింగ్ ఫైలే...తహాశీల్ధార్ ప్రాణాల మీదకు తెచ్చిందని ప్రాథమికంగా తెలుస్తోంది
ఏపీలోని (AP Politics) విశాఖలో (Visakha MRO) తహశీల్దార్ రమణయ్య (Ramaṇayya) హత్య (Murder) వెనుక సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయ్. రుషికొండలోని అత్యంత ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ వ్యవహారం తిరుగుతోంది. ఈ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్లకు అవసరమైన రెవెన్యూ క్లియరెన్స్ పెండింగ్ ఫైలే…తహాశీల్ధార్ ప్రాణాల మీదకు తెచ్చిందని ప్రాథమికంగా తెలుస్తోంది. రియల్టర్ ఒత్తిడిని రమణయ్య ఖాతరు చేయకపోవడంతో పక్కా పథకం ప్రకారం అంతం చేసినట్టు కనిపిస్తోంది.
తహాశీల్ధార్ హత్య కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిని అత్యంత కిరాతకంగా మట్టుబెట్టిన రియల్ ఎస్టేట్ ఆగడాలు భయకంపితులను చేస్తున్నాయి. మధురవాడ సర్వేనెంబర్ 380లోని భూముల రియల్ డీల్ రమణయ్య మర్డర్‌కు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అత్యంత ఖరీదైన రుషికొండ భూముల్లోనే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్స్ వున్నాయి. రామానాయుడు స్టూడియోకు అత్యంత సమీపంలో ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించిన ఈ కమ్యూనిటీలో ఆరు బ్లాకులుంటే… ఒక్కో బ్లాకు ఆరు ఫోర్లతో కట్టారు. ఈ నిర్మాణాల భూములపై వివాదం ఉంది. ఇప్పటికే కొన్ని బ్లాకుల్లో జనం నివాసం ఉంటున్నారు. నగరానికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వీటిని పూర్తి చేసినప్పటికీ… డిస్ప్యూట్ కారణంగా…కొన్ని అపార్ట్ మెంట్ల రిజిస్ట్రేషన్లు పెండింగ్ లో పడ్డాయి. వీటిని క్లియర్ చేయాలంటే రెవెన్యూ అనుమతులు తప్పనిసరి. ఆ పని చేసేందుకు తహాశీల్ధార్ రమణయ్య నిరాకరించారనేది సమాచారం.
తహాసీల్దార్ రమణయ్య హత్య వెనుక రియల్ ఎస్టేట్ డీల్ కారణమని పోలీసులు ధృవీకరించారు. ఆర్ధిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ తెలిపారు. దీంతో గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలు, భూముల వివాదంపై విచారణ జరుగుతోంది. ఋషికొండ ఐటి పార్క్ దగ్గర్లో కట్టిన అపార్ట్ మెంట్ కొంత జిరాయితీ, మరికొంత ప్రభుత్వ భూములు వున్నాయి. న్యాయవివాదం ఉండటంతో టీడీపీ 338 జీఓ తీసుకొచ్చింది. దీంతో అందరూ రెగ్యులరైజేషన్ కోసం అర్జీ పెట్టుకున్నారు. వీటిని పరిష్కరించడంతో భూమి నిర్మాణ సంస్థ చేతికి వచ్చింది. కానీ కన్వియన్స్ డీడ్ పెండింగ్ లో పడింది. దీంతో మొత్తం అపార్ట్ మెంట్లలో 10శాతం నిర్మాణాలకు రిజిస్ట్రేషన్లకు ఆటంకం కలుగుతోంది.
రమణయ్య హత్య కేసు నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారాంను పోలీసులు చెన్నైలో అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వివాదాల్లో తలదూర్చడం… సెటిల్మెంట్లు చేయడం అతని పని. నాలుగేళ్ళ క్రితం విశాఖకు వచ్చిన గంగారాం… స్ధానిక రియల్టర్ల ద్వారా బ్రోకరేజ్‌కు అంగీకరించినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారం రమణయ్య ఇంటికి వచ్చి అతనితో ఘర్షణపడి ఇనుపరాడితో దాడి చేసినట్టు అర్ధం అవుతోంది.