ఏపీ మందుబాబులకు అన్ హ్యాపీ, ధరలు తగ్గలేదా…?
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం షాపుల్లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. కొత్త బ్రాండ్ లు రావడంతో షాపుల వద్ద మందు బాబులు బారులు తీరారు. అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం షాపుల్లో అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. కొత్త బ్రాండ్ లు రావడంతో షాపుల వద్ద మందు బాబులు బారులు తీరారు. అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ధరపై మాత్రం మద్యం బాబులు పెదవి విరుస్తున్నారు. పాత ధరలకే విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 99/- క్వార్టర్ మద్యం విక్రయించడానికి ఇంకా స్టాక్ రాలేదని షాపు యజమానులు చెప్పడంతో డీలా పడ్డారు.
రెండు మూడు రోజుల్లో 99/- క్వార్టర్ మద్యం విక్రయాలు ప్రారంభమవుతాయని షాపు యజమానలు చెప్తున్నారు. ఇక మద్యం షాపుల విషయంలో ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. మద్యం షాపులు ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే దానిపై మార్గదర్శకాలు ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి పొందిన ఆస్పత్రులకు, దేవాలయాలకు, మసీదులకు, చర్చి సహా పలు మతాల పవిత్ర ప్రదేశాలకు, స్కూల్స్ కి వంద మీటర్ల దూరం పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే మద్యం షాపులకు దేవుళ్ళ పేర్లను కూడా నిషేధించారు.