AP elections CM Jagan : జగన్ చేసిన రెండో తప్పు.. కబ్జాలతో వణికించిన మంత్రులు, నేతలు
జగన్ జోరు చూసి కిందిస్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. ఉత్తరాంధ్ర ఇంచార్జిగా వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆ మూడు జిల్లాలని వణికించేశారు. సామాన్య ఉద్యోగులు, సాదాసీదా వ్యాపారులు కూడా భయపడి పోయే పరిస్థితి వచ్చింది.
జగన్ జోరు చూసి కిందిస్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు చెలరేగిపోయారు. ఉత్తరాంధ్ర ఇంచార్జిగా వెళ్లిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆ మూడు జిల్లాలని వణికించేశారు. సామాన్య ఉద్యోగులు, సాదాసీదా వ్యాపారులు కూడా భయపడి పోయే పరిస్థితి వచ్చింది. వ్యాపారాలు పెట్టారు.. కబ్జాలు చేశారు. రియల్ ఎస్టేట్ వాళ్లందరినీ తమ కంట్రోల్‌లో పెట్టుకున్నారు. తన్ని మరీ భూములు లాక్కున్నారు. విజయనగరంలో మజ్జి శ్రీనివాస్ అలియాస్ చిన్న శీనులాంటి వాళ్లు మరింత చెలరేగిపోయారు. ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ.. వైసీపీ వాళ్లే కైవసం చేసుకున్నారు. సాయి రెడ్డితో పాటు వైసీపీ వాళ్లంతరూ విశాఖలో వ్యాపారాలు విస్తరించారు.
విశాఖ భూములపైనే పడ్డారు. ప్రశాంతంగా ఉండే విశాఖ.. కబ్జాల పర్వంతో వణికిపోయింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో భాగంగా అడ్డగోలు కబ్జాలు చేసి పడేశారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన జీవి అనే ఆడిటర్.. విశాఖను గుప్పిట్లో పెట్టుకుని ఆడించారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు గనుల మీద పడ్డారు. పెద్దిరెడ్డి, సజ్జలతో పాటు కనీసం 60, 70 మంది ఎమ్మెల్యేలు… మైనింగ్‌పైనే ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. అన్ని తెలిసి కూడా ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు.
పార్టీపరంగా విశాఖ చేజారిపోతోంది అన్న హెచ్చరికతో… విజయ సాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. ఆర్థిక మంత్రి ఏకంగా పాణ్యం సిమెంట్స్ కంపెనీనే కొనుక్కున్నారు. ఆ మంత్రి, ఈ మంత్రి అని లేదు అందరూ 100ఏళ్లకు కావాల్సినంత సంపాదించుకున్నారు. పైకి మాత్రం అంత సీఎం చూసుకుంటున్నాడు. తనకు రూపాయి సంపాదన లేదంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటూనే… జగన్ నిర్లక్ష్యంగా వదిలిపెట్టాడు. ఇదే ఇప్పుడు ప్రమాదంగా మారింది.