AP elections CM Jagan: జగన్ చేసిన ఆరో తప్పు… గోతుల్లా మారిన రోడ్లు.. జనాల పాట్లు
ఏపీలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల గురించి పక్క రాష్ట్రంలోనే కాదు విదేశాల్లోనూ చర్చ జరుగుతోంది. ఏపీలో నేషనల్ హైవే మినహాయించి... మిగిలిన రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయ్.

The sixth mistake made by Jagan... The roads changed in the silos... People's songs
ఏపీలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల గురించి పక్క రాష్ట్రంలోనే కాదు విదేశాల్లోనూ చర్చ జరుగుతోంది. ఏపీలో నేషనల్ హైవే మినహాయించి… మిగిలిన రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయ్. చంద్రబాబు హయాంలో వేసిన సిమెంట్ రోడ్లు మినహా మిగతా రోడ్ల పరిస్థితి చెప్పలేం. డబ్బులనీ సంక్షేమ పథకాలకే పోవడంతో.. రోడ్లను పూర్తిగా వదిలేసింది జగన్ సర్కార్. ఏపీ రోడ్లపై సోషల్ మీడియాలో వేల జోక్స్, వీడియోలు కనిపిస్తాయ్. ముందుగా 3 నుంచి 4వేల కోట్లు ఖర్చు చేసి.. రోడ్లు బాగు చేయించి ఉంటే బాగుండేది.. ఐతే అది కూడా చేయలేకపోయారు. జనం ఏం మాట్లాడుకుంటున్నారో జగన్‌కి తెలియకపోవడమే… చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి కారణం. దీనికి తోడు సంక్షేమ పథకాలకు ప్రతీ నెల వేల కోట్లు ఖర్చు చేయడం, ఆదాయం పెరగకపోవడంతో మౌలిక సదుపాయాలపై జగన్ దృష్టి పెట్టలేదు. అదే ఆయన చేసిన ఆరో తప్పు.