AP elections CM Jagan : జగన్ చేసిన మూడో అతిపెద్ద తప్పు… జనాలకు, లీడర్లకు అందుబాటులో లేకపోవడం..
జగన్ చేసిన మరో పెద్ద తప్పిదం ఐదేళ్లలో... ఎమ్మెల్యేలు కానీ.. మంత్రులు కానీ.. వన్ టూ వన్ కలవకపోవడం. జనాలను కూడా ఎన్నడూ కలిసింది లేదు. ఈ ఐదేళ్లలో జగన్ ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదు.

The third biggest mistake made by Jagan... Lack of access to people and leaders..
జగన్ చేసిన మరో పెద్ద తప్పిదం ఐదేళ్లలో… ఎమ్మెల్యేలు కానీ.. మంత్రులు కానీ.. వన్ టూ వన్ కలవకపోవడం. జనాలను కూడా ఎన్నడూ కలిసింది లేదు. ఈ ఐదేళ్లలో జగన్ ఒక్క ప్రెస్‌మీట్ కూడా పెట్టలేదు. అభివృద్ధి పథకాలు అమలు చేసేటప్పుడు, సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు… బటన్ నొక్కడం, స్పీచ్ ఇవ్వడం… చివరలో చంద్రబాబు, పవన్‌ని తిట్టడం… జగన్ చేసింది ఇదే ! ఇంతకుమించి తన ఎమ్మెల్యేలు, ఎంపీలను జగన్ ఏ రోజూ కలిసింది లేదు. జనాలను అసలే కలవలేదు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంట్రీ ఇస్తే… వాళ్ల డిమాండ్లు పెరిగిపోతాయనేది సీఎం ఆలోచన. జగన్‌కు, నాయకులకు మధ్య సజ్జల అనే ఒక మీడియేటర్ మాత్రమే ఉన్నాడు. అసలు ఎమ్మెల్యేలను, జనాలను కలవకపోవడంతో తాడేపల్లి కోట బయట ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు జగన్.