CM Jagan : జగన్‌ మీదకి చెప్పు విసిరింది వీళ్లే..

ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమిని గెలిపించుకోవాలని చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌. మూడీ పార్టీలను ఢీ కొట్టి మరోసారి అధికారం చేపట్టాలని జగన్‌ తీరిక లేకుండా ప్రచారాలు చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 31, 2024 | 06:35 PMLast Updated on: Mar 31, 2024 | 6:35 PM

They Are The Ones Who Threw The Shoe At Jagan

 

ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కూటమిని గెలిపించుకోవాలని చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌. మూడీ పార్టీలను ఢీ కొట్టి మరోసారి అధికారం చేపట్టాలని జగన్‌ తీరిక లేకుండా ప్రచారాలు చేస్తున్నారు. ఏం చేశారో చెప్తూ జగన్‌, గెలిపిస్తే ఏం చేస్తారో చెప్తూ పవన్‌ చంద్రబాబు ప్రజల్లోకి వెళ్తున్నారు. తక్కువ టైంలోనే ఎక్కువ ప్రాంతాలు కవర్‌ చేసేలా షెడ్యూల్‌ రెడీ చేసుకుని అన్ని ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్‌ నిన్న అనంతపురంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌ షోలో జగన్‌ వెళ్తున్న సమయంలో ఆయనపైకి చెప్పు విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ చెప్పు జగన్‌ వరకూ రీచ్‌ అవ్వకపోయినా.. వీడియోలో మాత్రం చాలా క్లియర్‌గా కనిపించింది.

ఈ వీడియో చూస్తే ఎవరో కావాలనే చెప్పు విసిరినట్టు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎంత కాదనుకున్నా జగన్‌ ఏపీకి సీఎం. దీంతో ఆయన మీదకు చెప్పు విసిరింది ఎవరు అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదే విషయంపై స్థానిక వైసీపీ కార్యకర్తలు నాయకులు టీడీపీని ప్రధానంగా టార్గెట్‌ చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలే ఈ పని చేశారని చెప్తున్నారు. మూడు పార్టీలు కలిసి వచ్చినా జగన్‌ వచ్చిన ఆదరణ తమకు రావడంలేదన్న అక్కసుతో ఈ పని చేశారని చెప్తున్నారు. జగన్‌ చుట్టూ తామంతా ఉన్నామని.. ఇలాంటి దాడులు జగన్‌ను రీచ్‌ కూడా అవ్వకుండా అడ్డుకుంటామని చెప్తున్నారు. అయితే ఇదే విషయంలో టీడీపీ కార్యకర్తలకు కూడా వైసీపీ నేతలకు కౌంటర్‌ ఇస్తున్నారు. టీడీపీ మీద బురద జల్లేందుకు వైసీపీ కార్యకర్తలే ఈ పని చేశారని చెప్తున్నారు.

ఇలా దాడులు చేయించుకుని అధికారం చేజిక్కించుకోవడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆరోపిస్తున్నారు. రాయలసీమ వైసీపీకి మంచి పట్టు ఉన్న ప్రాంతం. గత ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతం నుంచే వైసీపీకి ఎక్కువ సీట్లు కూడా వచ్చాయి. దాడి చిన్నదే అయినా అది నేరుగా జగన్‌ మీద జరగడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ విషయంలో ప్రస్థుతం అనంతపూర్‌ టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చెప్పు విసిరింది ఎవరు అన్న సంగతి పక్కన పెడితే.. ఎన్నికల వేళ అనంతపూర్‌ జిల్లాలో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది.