AP Politics : ఏపీ రాజకీయాలను మార్చేసిన రోజు ఇదే..

ఇది కేవలం చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న రోజు మాత్రమే కాదు. ఓ పార్టీ తలరాత మారిపోయిన రోజు. బహుశా అసెంబ్లీ కూడా అనుకోలేదోమో.. ఈ ఒక్క రోజు ఏపీలో ఓ పెద్ద మార్పు తేబోతోంది అని. చంద్రబాబు చేసిన ఈ శపథం ఆవేశంతో.. నో కోపంతోనో చేసింది కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 21, 2024 | 06:32 PMLast Updated on: Jun 21, 2024 | 6:32 PM

This Is The Day That Changed Ap Politics

 

ఇది కేవలం చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న రోజు మాత్రమే కాదు. ఓ పార్టీ తలరాత మారిపోయిన రోజు. బహుశా అసెంబ్లీ కూడా అనుకోలేదోమో.. ఈ ఒక్క రోజు ఏపీలో ఓ పెద్ద మార్పు తేబోతోంది అని. చంద్రబాబు చేసిన ఈ శపథం ఆవేశంతో.. నో కోపంతోనో చేసింది కాదు. కన్నీళ్లతో, కసితో చేసింది. నిండు సభలో.. ఆయన రాజకీయ అనుభవమంత వయసు కూడా లేని వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అవమానానికి.. ఆరోజు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రధాని పదవికి కూడా పోటీ పడే స్థాయి ఉన్న ఆయన కళ్ల నుంచి వచ్చిన ఆ కన్నీటి వేడిలో వైసీపీ ఈరోజు కాలిపోయింది.

ఈ ఒక్క రోజు వైసీపీని ఓడించాలనే కసిని చంద్రబాబులో పెంచింది. సీఎం అయ్యాకే సభకు వస్తానని ఆయన చేసిన శపథాన్ని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు ఒకటి రెండు కాదు.. చాలా అడుగులే వెనక్కి వేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతం చేసేందుకు ఆరోజు నుంచి చంద్రబాబు ప్రతీ అడుగూ వేశారు. 70 ఏళ్ల వయసులో రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. నిరుద్యోగ యువతీ యువకులను ఏకం చేసేందుకు నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర చేశారు. కేసులను ఎదుర్కున్నారు అవమానాలను తట్టుకున్నారు. పార్టీ కోసం కష్టపడ్డవాళ్లకు టికెట్టు ఇవ్వలేని పరిస్థితిని కూడా సమర్థవంతంగా ఎదుర్కున్నారు. పార్టీ కేడర్‌ మొత్తం వ్యతిరేకించినా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఒక్కశాతం ఓట్‌బ్యాంక్‌ కూడా లేని బీజేపీకి కూటమి ఒప్పందం ప్రకారం పెద్ద మొత్తంలో సీట్లు కేటాయించారు. సీట్ల సర్దుబాటు చేసే ప్రక్రియలో తన వాళ్ల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నారు. బాధను భరించారే తప్ప వెనకడుగు మాత్రం వేయలేదు.

ఈ ఒక్క స్టెప్‌ చాలు.. వైసీపీని అధికారం నుంచి దించాలి అనే కసి చంద్రబాబులో ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. ఐదేళ్ల పోరాటం.. వ్యక్తగత దూషణలు.. 50 రోజుల జైలు జీవితం.. ప్రతీ ఘటన ఆయనలో కసిని పెంచిందే తప్ప.. ధైర్యాన్ని మాత్రం ఇంచు కూడా తగ్గించలేకపోయింది. కొట్టారు.. తిరుగులేని దెబ్బకొట్టారు. 161 ఎమ్మెల్యేలు 21 ఎంపీలతో ఏపీ రాజకీయాలనే కాదు.. దేశ రాజకీయాలను కూడా శాసించగలిగే స్థాయిలో కొట్టారు. నారా చంద్రబాబు నాయుడు అను నేను అనే మాట కోసం ఆయన అభిమానులు ఎంతగా ఎదురు చూశారో.. ఆయన కార్యకర్తలు ఎన్ని బాధలను భరించారో.. వాళ్లందరూ గర్వంతో కాలర్‌ ఎగరేసే స్థాయిలో దెబ్బ కొట్టారు. అధికారానికి పేటెంట్‌ తీసుకున్నాం అన్న రేంజ్‌లో మాట్లాడిన వైసీపీకి.. కనీసం అసెంబ్లీలో గొంగెత్తే నెంబర్‌ కూడా లేనంత గట్టిగా కొట్టారు.

సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తాను.. ఇది కౌరవ సభ అని ఎంత బాధతో అన్నారో.. అంతే గౌరవంగా సీఎంగా ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు అను నేను అనే మాట ఆయన నోటిం నుంచి గారానే ఆ 161 మంది ఎమ్మెల్యేల కళ్లలో నీళ్లు తిరిగియి.. వాళ్లు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుని ఆ హృదయాలు విజయోత్సాహంతో ఉప్పొంగాయి. చేసిన అవమానాలను ఆయుధాలుగా చేసుకుని.. మోసిన కేసులను మెట్లుగా మార్చుకుని.. ఏ అసెంబ్లీలో మాటలు పడ్డారో.. అదే అసెంబ్లీలో సీఎం కుర్చీలో దర్జాగా కూర్చున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇదీ.. అహంకారాన్ని ఆత్మగౌరవంతో దెబ్బ కొట్టిన క్షణం. న్యాయం గెలిచి ప్రజాస్వామ్యం నిలిచిన క్షణం.