Babu Nitish : బాబును ఇరుకున పెట్టిన నితీష్
ఈసారి కేంద్ర ప్రభుత్వంలో NDA ప్రభుత్వం కొనసాగుతోంది అంటే... అది టీడీపీ, జేడీయూ చలవే. ఈ రెండు పార్టీలు లేకపోతే మూడోసారి నరేంద్రమోడీ అధికారం చేపట్టడం కష్టమయ్యేది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో... ఈ రెండు పార్టీలకు చెరో రెండు పదవులు ఇచ్చారు మోడీ. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పై రెండు పార్టీలు పట్టుబడుతున్నాయని వార్తలు వచ్చినా... అవేమీ నిజం కాదని తేలిపోయింది.
ఈసారి కేంద్ర ప్రభుత్వంలో NDA ప్రభుత్వం కొనసాగుతోంది అంటే… అది టీడీపీ, జేడీయూ చలవే. ఈ రెండు పార్టీలు లేకపోతే మూడోసారి నరేంద్రమోడీ అధికారం చేపట్టడం కష్టమయ్యేది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో… ఈ రెండు పార్టీలకు చెరో రెండు పదవులు ఇచ్చారు మోడీ. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పై రెండు పార్టీలు పట్టుబడుతున్నాయని వార్తలు వచ్చినా… అవేమీ నిజం కాదని తేలిపోయింది. చంద్రబాబు కూడా మాకు పదవులు ముఖ్యం కాదు… ఏపీకి నిధులు కావాలని సూచించారు. కానీ ఉన్నట్టుండి… బిహార్ సీఎం నితీష్ కుమార్ అందుకున్న అస్త్రంతో ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇరుకున పడ్డారు.
బిహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో జరగబోతున్నాయి. మళ్ళీ జేడీయూ గెలవడం కష్టమే అంటున్నారు. అందుకే ఉన్నట్టుండి బిహార్ కి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ కావాలంటూ JDU తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటై ఇంకా నెల రోజులు కాకముందే NDA సర్కార్ ముందు నితీష్ కండిషన్ పెట్టడంతో బీజేపీ శ్రేణులు షాక్ అయ్యాయి. నితీష్ చేసిన డిమాండ్ ప్రభావం ఇప్పుడు చంద్రబాబుపైనా పడే అవకాశాలున్నాయి. బిహార్ కి స్పెషల్ స్టేటస్ ఇస్తే… ఏపీకి ఇవ్వాల్సిందే. ఇక్కడ ఆ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పెట్టినప్పుడు యూపీఏ కూడా ఇలాంటి హామీ ఇచ్చింది. తర్వాత NDA అధికారంలోకి రావడంతో ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరుగున పడింది. 2014లో బాబు సీఎ అయినా.. ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. అప్పట్లో హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తారన్న టాక్ నడిచింది. కానీ బాబు వద్దన్నారంటూ ప్యాకేజీపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు NDA ప్రభుత్వం. గత ఐదేళ్ళల్లో జగన్ కూడా కేంద్రం ప్రభుత్వం నుంచి ఏమీ సాధించలేకపోయారు.
మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ స్పెషల్ స్టేటస్ నినాదం ఎత్తుకున్నా… జనం ఆ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక… జగన్ ఇదే అంశం లేవనెత్తారు. ఇప్పటికైనా స్పెషల్ స్టేటస్ తేవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జేడీయూ చేసిన తీర్మానంతో చంద్రబాబు ఎలా ముందుకెళతారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా ఉన్న టీడీపీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ డిమాండ్ చేస్తారా… చేయాల్సిన తప్పని పరిస్థితి కూడా. లేకపోతే ఏపీ ప్రజలకు ఏమని సమాధానం చెప్పుకుంటారన్నది సస్పెన్స్ గా మారింది.