Srivari Darshan Tickets : సెప్టెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల..
తిరుమల తిరుపతి వెంకటేశ్వర.. శ్రీవారి దర్శన టికెట్లు కొద్ది సేపటి క్రితమే ఆన్ లైన్ లో విడుదలయ్యాయి.

తిరుమల తిరుపతి వెంకటేశ్వర.. శ్రీవారి దర్శన టికెట్లు కొద్ది సేపటి క్రితమే ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు టీటీడీ ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. దీని ద్వారా తిరుపతి, తిరుమలలో గదులు బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 27 తేదీన తిరుమల – తిరుపతి శ్రీవారి సేవా కోటాను ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. నవనీత సేవకు సంబంధించిన టికెట్‌లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవకు సంబంధించినవి మధ్యాహ్నం 1 గంటకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది.
శ్రీవారి దర్శన టికెట్ల బుక్కింగ్ వెబ్ సైట్..
భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు వెల్లడించారు.