AP CM Chandrababu : నేడు హస్తినకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. మోదీ, అమిత్ షా తో బాబు భేటీ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హస్తినకు వెళ్లారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 3, 2024 | 01:17 PMLast Updated on: Jul 03, 2024 | 1:17 PM

Today Ap Cm Chandrababu Naidu Met Modi And Amit Shah

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు వెంట మంత్రులు పయ్యావుల, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హస్తినకు వెళ్లారు. ఇవాళ జూలై 3న సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. జూలై 4న ఉదయం ప్రధాని అపాయింట్మెంట్ దొరకడంతో.. సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు ప్రధాని, సంబంధిత శాఖ మంత్రులను విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సాయం, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సహకారం, పారిశ్రామిక రాయితీలు, మౌలిక వసతుల కల్పన, ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరనున్నారు. మరో వైపు త్వరలోనే ఏపీ బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టనున్నారు. దీంతో ఆ సారి ఏపీకి ఎక్కువ బడ్జెట్ తో నిధులు విడుదల చేయ్యాలని ప్రధానితో, ఆర్ధిక శాఖ మంత్రి విజ్ఞప్తి చేయనున్నారు.

గత ప్రభుత్వం చేసిన ఆర్థిక ఖర్చులను… ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు CM చంద్రబాబు వివరించనున్నారు. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా నివేదికలు ఇవ్వనున్నట్టు సమచారం.. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులివ్వాలని కోరనున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు కలవనున్న కేంద్ర మంత్రుల జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్ తో పాటు మరికొందరు మంత్రులతోనూ భేటీ కానున్నారు