Central Election Commission : ఓటు హక్కుకు నేడే చివరి తేదీ… వజ్రాయుధం వదులుకోకండి సుమా..!

దేశ వ్యాప్తంగా దేశ సార్వత్రిక ఎన్నికలకు (General Elections) రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 15, 2024 | 01:15 PMLast Updated on: Apr 15, 2024 | 1:29 PM

Today Is The Last Date For The Right To Vote Dont Give Up The Diamond Weapon Suma

 

 

ఓటు చూపుడు వేలి.. వజ్రాయుధంతో దేశంలో ఏ పార్టీ మనల్ని పరిపాలాలో నిర్ణయిస్తుంది. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. చిన్న.. పెద్ద.. ధనవంతుడు.. పేదవాడు.. యువతి.. యువకులు.. అక్షరాస్యులు.. నిరక్షరాస్యులు.. అంది వద్ద ఉన్న ఓటు అనే మహా వజ్రాయుధం.. రాష్ట్ర, దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి ఉపయోగించే శక్తి ఈ ఓటు హక్కు.. దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది.

ఇక విషయంలోకి వెలితే…

దేశ వ్యాప్తంగా దేశ సార్వత్రిక ఎన్నికలకు (General Elections) రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వెలువడింది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడనుంది. ఓటు హక్కు లేనివారు నేడు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు చివరి తేదీగా ఈసీ వెల్లడించింది. ఈరోజు కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు.. మే నెలలో జరగనున్న దేశ సార్వత్రిక ఎన్నికల్లో మీ తొలి ఓటును వినియోగించుకోవచ్చు. ఈసీ ఓటర్ల జాబితాలో పేరు లేకుంటే వెంటనే ఓటు హక్కు పొందడానికి ఈ రోజు మాత్రమే ప్రయత్నించాలని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

సాధారణంగా చాలా మంది ఎన్నికల రాబోతున్న రెండు లేదు మూడు నెలల ముందు వరకు ఓటు హక్కు.. ధారకస్తు నమోదు చేసుకుంటారు. ఇలా నమోదు చేసుకున్న పేర్లలో కొన్ని పేర్లు రిజెక్ట్ అయిపోతాయి. పలు కారణాలతో పేర్లు మిస్సయ్ పోతాయి. తుది జాబితాకు అనుబంధంగా ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉన్నందున ఈరోజు ఓటు హక్కు నమోదుకు ఆఖరి రోజుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. నేరుగా బూత్ స్థాయి అధికారుల వద్దకు వెళ్లి ఫారం 6 ద్వారా కూడా ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ ఓటు నమోదు పద్దతి..

18 ఏళ్లు నిండిన ఓటర్లు www.nvsp.in వెబ్ సైట్ లోకి వెళ్లి కొత్త ఓటరు నమోదు ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఫామ్ 6 ఓపెన్ అవుతుంది. ఇందులో వివరాలన్నీ నింపి సబ్మిట్ చేస్తే రిఫరెన్స్ ఐడీ జనరేట్ అవుతుంది. దాన్ని ఉపయోగించి ఓటు రిజిస్ట్రేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే https://voterportal.eci.gov.in / లేదా https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html వెబ్ సైట్లలోకి వెళ్లి కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు.

SSM